కరీంనగర్ లో నాగపూర్ గ్యాంగ్.. రెండు వైన్ షాపుల్లో చోరీ

కరీంనగర్ లో భారీ చోరీ జరిగింది. నాగ్ పూర్ కు చెందిన ఓ గ్యాంగ్ ఒకే రోజు రెండు వైన్ షాపుల్లో చోరీకి పాల్పడింది.  కోతి రాంపూర్ లోని మొదటి షాపును దొంగలించేందుకు వెళ్లగా షాపులో నగదు లేకపోవడంతో వెనుదిరిగారు. దారిలో మరో వైన్ షాపు కనిపించడంతో అక్కడ లూటీ చేయాలని ప్లాన్ వేశారు. దొంగతనం చేద్దామని  షాపు షెట్టర్ తొలగిస్తుండగా ఓ దొంగను స్థానికులు గుర్తించారు.

 వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో గ్యాంగ్ మొత్తం పరారవ్వగా ఒక్కరు చిక్కారు. దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నాగపూర్ కు చెందిన గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. వైన్ షాపులో ని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.  

Also Read:-8వ తరగతి పిల్లోడు.. ట్రైన్ ఎక్కి తిరుపతి పోయాడు