మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు : కుందూరు జైవీర్ రెడ్డి

  • ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

 హాలియా, వెలుగు : ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి చెరువు, గుర్రంపోడ్​మండలం చేపూరు పెద్దచెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆయా చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. అనంతరం తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి, సిల్గాపురం గ్రామాల్లో పేదల ఇండ్ల స్థలాలను పరిశీలిచారు.

 అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనీల్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్ర శేఖర్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమావత్ కృష్ణా నాయక్, సాగర్ మున్సిపల్ కౌన్సిలర్ రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.