గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : కుందూరు జైవీర్ రెడ్డి

  • ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు : గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం అనుముల మండలం పంగవానికుంటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. 

అనంతరం పెద్దవూర మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్ ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు ఎడవల్లి నరేందర్ రెడ్డి, చింతల చంద్రారెడ్డి, వెంపటి శ్రీనివాస్, తేర రంగారెడ్డి, తేర భిక్షంరెడ్డి, పోల సైదులు తదితరులు పాల్గొన్నారు.