సాగర్‌‌ గేట్లు మళ్లీ ఓపెన్‌‌

  • 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో
  • 20 గేట్లు ఎత్తిన ఆఫీసర్లు

హాలియా, వెలుగు : నాగార్జున సాగర్‌‌ ప్రాజెక్ట్‌‌ క్రస్ట్‌‌ గేట్లు మళ్లీ ఓపెన్‌‌ అయ్యాయి. ఎగువ నుంచి 2,10,446 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండడంతో 20 గేట్లను ఎత్తి 1.62 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు నాగార్జున సాగర్‌‌ ప్రాజెక్ట్‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా నమోదైంది. సాగర్‌‌ నుంచి కుడి కాల్వకు 10,200 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,173, విద్యుత్‌‌ ఉత్పత్తికి 29,273, ఎస్‌‌ఎప్‌‌బీసీకి 2,400, వరదకాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.