నిరుపేదలకు అండగా ఉంటా.. జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. హాలియా మున్సిపాలిటీ ఆరో వార్డుకు చెందిన శీలం వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. కౌన్సిలర్ గౌని సుధారాణి రాజారమేశ్ యాదవ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే  జైవీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన వెంటనే స్పందించి నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటయ్యకు తక్షణ సాయం కింద రూ.3 లక్షల ఎల్వోసీ,  రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం వెంకటయ్యకు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజారమేశ్ యాదవ్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చంద్రారెడ్డి, సాగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రామకృష్ణా, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.