Chennai Train Accident: ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. వర్షంలోనూ బోగీల తరలింపు..

శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) చెన్నై శివారులో జరిగిన మైసూర్ - దర్బంగా బాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం కలకలం రేపింది. తిరువల్లూరులోని కవరై ప్పెట్టై దగ్గర ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో బోగీల నుంచి మంటలు చెలరేగి.. 12బోగీలు పట్టాలు తప్పాయి. 

Also Read :- ప్రధాని మోది కృషి ఫలించాలి

ఈ ఘోర ప్రమాదంలో 19మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. సుమారు వెయ్యి మంది సిబ్బంది ఈ ఆపరేషన్ పాల్గొంటున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ బోగీల తరలింపు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తున్నారు అధికారులు.

శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) రాత్రి 8:27 గంటల సమయంలో కవరైప్పెట్టై స్టేషన్‌ దగ్గర చోటు చేసుకుంది ఈ ప్రమాదం. రైలు మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక.. స్టేషన్‌లోకి ప్రవేచించే సమయంలో భారీ కుదుపు జరిగినట్లు రైలు సిబ్బంది తెలిపారు. తర్వాత మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన రైలు కాస్తా..  లూప్‌ లైన్‌లో వెళ్లి అక్కడ ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు 04425354151, 04424354995 ఏర్పాటు చేశారు చెన్నై రైల్వే డివిజన్‌ అధికారులు.