మన భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఏదో చరిత్ర దాగి ఉందని ఆ ప్రాంత పెద్దలు చెబుతుంటారు. అలాంటి దేవాలయాల్లో శ్రీ వజ్రేశ్వరి దేవాలయం. ఈ ఆలయంలో భైరవుని చిన్న ఆలయం ఉంది. భైరవుని విగ్రహం కళ్ల నుంచి అప్పుడప్పుడు కన్నీరు కారుతుందని పండితులు చెబుతున్నారు.
మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయమే శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం. హిమాచల్‌లోని ప్రసిద్ధ శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని నాగర్ కోట్ దేవి, కాంగ్రా దేవి అని కూడా పిలుస్తారు. ఇది వజ్రేశ్వరి దేవతకు అంకితం చేయబడిన 51 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. ఇది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా పట్టణంలో ఉన్న దుర్గా దేవి రూపం.
మన దేశంలో అనేక రహస్య ఆలయాలున్నాయి. కొన్ని మిస్టరీలను నేటికీ ఛేదించలేకపోయారు. అలాంటి మిస్టరీ ఆలయం హిమాచల్‌లోని ప్రసిద్ధ శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయం ధర్మశాల నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నాగర్‌కోట్ పట్టణంలోని కాంగ్రాలో ఉంది. పార్వతి దేవి ప్రసిద్ధ ఆలయంగా ఖ్యాతిగాంచింది. తొమ్మిది పుణ్యక్షేత్రాలలో ఒకటి. అంతేకాదు శక్తి పీఠాల్లో ఒకటి. వజ్రేశ్వరి దేవిని స్థానికులు కంగ్రా దేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిది. భక్తులు దూరం నుంచే ఈ ఆలయంలోని బంగారు కలశాన్ని చూడవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేని రహస్యం ఉందని.. భక్తులు దీనిని అమ్మవారి అద్భుతంగా భావిస్తారు.
విగ్రహం నుంచి కన్నీరు ....
కాంగ్రాలోని వజ్రేశ్వరి దేవి ఆలయంలో కాల భైరవుని విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం, చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు, భైరవుని విగ్రహం కళ్ల నుంచి కన్నీరు కారుతుందని పండితులు చెబుతున్నారు. విగ్రహం నుండి కన్నీళ్లు రావడం చూసి, అక్కడున్న పండితులు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారట. ఈ భైరవ విగ్రహం సుమారు 5 వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. భైరవస్వామి కన్నీళ్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు.ఈ ఆలయ ప్రధాన ద్వారం ప్రవేశ ద్వారం నాగర్‌ఖానా లేదా డ్రమ్ హౌస్ రూపంలో బస్సేన్ కోట ప్రవేశ ద్వారంలాగా నిర్మించారు. ఈ దేవాలయం చుట్టూ రాతి గోడ ఉంది. ప్రధాన ఆలయంలో వజ్రేశ్వరి దేవి దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో భైరవుని చిన్న ఆలయం కూడా ఉంది. ప్రధాన ఆలయం ముందు ధయాను భగత్ విగ్రహం కూడా ఉంది.
ఆలయ చరిత్ర
పూర్వం దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురిని , అల్లుడిని( శివుడిని) పిలవలేదు. దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి ? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, అనుచర గణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కాని అక్కడ అవమానానికి గురయ్యింది. సతీదేవి తండ్రి దక్షుడు శివుడిని అల్లుడు అని కూడా చూడకుండా దుర్భాష లాడాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దీంతో తన భర్త శివుడిపై సహించలేక ఆమె అక్కడున్న అగ్నిలో దూకి తనను తాను దహనం చేసుకుంది. . దీంతో ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
వజ్రేశ్వరి మాత ఎలా ఉద్భవించిందంటే......
అనంతరం శివయ్య తన భార్య సతీదేవి మృత దేహాన్ని భుజంపై వేసుకుని మోస్తూ విశ్వం చుట్టూ తిరుగుతూ శివ భగవానుడు చేయవలసిన జగద్రకషణ కార్యాన్ని మానివేశాడు. దేవతలు అందరూ కలిసి శ్రీ విష్ణువు దగ్గరకు వెళ్లి చర్చించగా.. తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించాడు. అప్పుడు ఆమె శరీర భాగాలు భూమిమీద రకరకాల ప్రదేశాల్లో పడ్డాయి. సతీదేవి శరీర భాగం ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠం ఏర్పడింది. ఇలా సతి ఎడమ రొమ్ము పడిపోయిన ప్రదేశం వజ్రేశ్వరి ఆలయం. కాంగ్రా మాయి పేరుతో పూజించబడుతుందని నమ్ముతారు.