టూల్స్ గాడ్జెట్‌ : వీటి ఉపయోగాలు ఏంటంటే

సిటీల్లో చాలామందికి ఇంటిదగ్గర టూ వీలర్​ పార్కింగ్​కు ప్లేస్ దొరకదు. దాంతో బైక్స్​ను ఇంటి బయట, గేటు ముందు పార్క్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తారనే భయం కూడా ఉంటుంది. అలాగని సీసీ కెమెరాలు పెట్టించాలి అనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు డమ్మీ కెమెరాలు పెట్టుకుంటే దొంగలు కాస్తయినా భయపడతారు. 

వీటిని ఎంఎక్స్​ అనే కంపెనీ మార్కెట్​లో అమ్ముతోంది. ఈ కెమెరాలను ఎక్కడైనా ఈజీగా ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. రెండు ఏఏఏ బ్యాటరీలు వేస్తే.. నిజమైన కెమెరాలాగే ఇందులో కూడా చిన్న రెడ్​ లైట్​ బ్లింక్​ అవుతుంటుంది. కానీ.. ఇందులో లెన్స్​లు ఉండవు. ఇది ఆడియో, వీడియో రికార్డ్​ చేయలేదు. ​

ధర: 199 రూపాయలు 

4 ఇన్​ 1 లైట్​

క్యాంపింగ్​ లేదా టూర్​కి వెళ్లినప్పుడు ఫ్లాష్​లైట్​, పవర్​బ్యాంక్​, టేబుల్​ ల్యాంప్​ లాంటివాటిని తీసుకెళ్తుంటారు. కానీ.. ఈ ఒక్క గాడ్జెట్​ ఉంటే వాటన్నిటి అవసరమే ఉండదు. ఎందుకంటే.. ఇదొక్కటే అన్నింటి అవసరాలు తీరుస్తుంది. విప్రో కంపెనీ తీసుకొచ్చిన ఈ మల్టీ ఫంక్షనల్​ లైట్​కి నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి హై క్వాలిటీ ఎల్​ఈడీ లైట్ ఉంటుంది. టార్చ్​లా పనిచేస్తుంది. 

అదే లైట్​ని గాడ్జెట్​ పై భాగాన్ని సాగదీసి టేబుల్​ ల్యాంప్​లా కూడా వాడుకోవచ్చు. మూడు డిమ్మింగ్​ అడ్జట్స్​మెంట్స్​ ఉంటాయి. పవర్ బ్యాంక్​లా కూడా పనిచేస్తుంది. ఇందులో 3000 mAH లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్, హెడ్‌‌‌‌ఫోన్ లాంటివాటిని ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్​బీ అవుట్‌‌‌‌పుట్‌‌‌‌ ఉంటుంది. ఫోన్​ హోల్డర్​లా కూడా ఉపయోగపడుతుంది.  ఫుల్​ ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. 24 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది.

 ధర : 1,499 రూపాయలు 

బ్యాటరీ టెస్టర్ ​

ఇంట్లో టీవీకి వాడే రిమోట్​ దగ్గర్నించి కంప్యూటర్​ మౌస్, టాయ్స్​ వరకు అన్నింటిలో బ్యాటరీలను వాడుతుంటాం. అయితే.. వాటిలో బ్యాటరీ లైఫ్​ ఇండికేషన్​ ఉండదు. అలాంటప్పుడు బ్యాటరీ ఇంకెన్ని రోజులు పనిచేస్తుందో అంచనా వేయడం కష్టమే. కాబట్టి బ్యాటరీలను ఈ టెస్టర్​లో పెట్టి చెక్​ చేసుకోవాలి. ఇందులో ఏఏ, ఏఏఏ, సీ, డీ, 1.5V,9V, బటన్​ బ్యాటరీలను పెట్టి చెక్​ చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఇండికేటర్​ ముల్లు రెడ్​ కలర్​ మీదకి వచ్చిందంటే... బ్యాటరీ మార్చాలనే సజెషన్​. ఆకుపచ్చ రంగు మీద ముల్లు ఉంటే బ్యాటరీ బాగుందని, ఎల్లో కలర్​ మీద ఉంటే లో బ్యాటరీ అని అర్థం.

 ధర : 275 రూపాయలు

గేమింగ్​ ట్రిగ్గర్స్​ 

ఫోన్​లో ఎక్కువగా గేమ్స్​ ఆడేవాళ్లకు పనికొచ్చే ట్రిగ్గర్స్​ ఇవి. గేమ్​ ఆడుతున్నప్పుడు కింది భాగంలో స్క్రీన్​ని బొటనవేలితో టచ్​ చేస్తుంటారు. కానీ.. పైభాగంలో ఉండే ట్రిగ్గర్స్​ని చూపుడు వేలితో క్లిక్​ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. ఆ ప్లేస్​లో ఈ ట్రిగ్గర్స్​ని ఇన్​స్టాల్​ చేసుకుని, వీటి పైభాగంలో ఉండే బటన్స్​ని నొక్కచ్చు. స్పిన్​ బోట్​ అనే కంపెనీ వీటిని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. 

ఇవి స్ట్రాంగ్​ ఏబీఎస్​ మెటీరియల్​తో తయారయ్యాయి. మిలియన్ ప్రెస్ టెస్ట్‌‌‌‌లో కూడా పాస్​ అయ్యాయి. అంటే వీటిని పది లక్షల సార్లు నొక్కినా పనిచేస్తాయన్నమాట. బటన్లకు ప్రీమియం నికెల్ కోటింగ్​ ఉంటుంది. వీటిని ఇన్​స్టాల్​ చేయడం కూడా చాలా ఈజీ. ఆండ్రాయిడ్​, ఐ ఫోన్​ రెండింటికీ వాడుకోవచ్చు. పబ్జీ, రూల్స్ ఆఫ్ సర్వైవల్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ లాంటి గేమ్స్​కి ఇది బాగా సరిపోతుంది. 

ధర: 449 రూపాయలు