చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పని. ఎందుకంటే చలికాలంలో శరీరం చెమట బారిన చాలా తక్కువగా పడుతుంది. ఈ కారణంగా శరీర బరువును, పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం కష్టం. అయితే బరువు తగ్గే విషయానికి వస్తే చికెన్, మటన్ తినడం పూర్తిగా మానేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ నాన్ వెజ్ ప్రియులు మాత్రం చికెన్, మటన్ తినడం మానేయడం చాలా కష్టం. వాటిలో ఒకటి మీ బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లో ఈ రెండింటిలో దాగి ఉన్న పోషకాలు, విటమిన్లు బరువు తగ్గేందుకు ఎలా సహకరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లో పోషకాలు
US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, 100 గ్రాముల చికెన్‌లో 140 కేలరీలు, 24.11 గ్రాముల ప్రోటీన్, 3.12 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది కాకుండా, చికెన్ లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక పోషకాలు విరివిగా లభిస్తాయి. అందువల్ల చికెన్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.
మటన్ లో పోషకాలు
మటన్ గురించి చెప్పాలంటే, 100 గ్రాముల మటన్‌లో 143 కేలరీలు, 3.5 గ్రాముల కొవ్వు, 57 మిల్లీగ్రాముల సోడియం, 26 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. దీంతో పాటు, ఐరన్, జింక్, విటమిన్ బి 12 వంటి పోషకాలు మటన్‌లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమంటే..
మటన్‌తో పోలిస్తే చికెన్‌లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల చికెన్ బరువు తగ్గించడంలో ఎక్కువ శాతం సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఏదైనా డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నవారు మటన్‌కు బదులుగా చికెన్‌ని తినవచ్చు. చికెన్ కంటే మటన్‌లో ఎక్కువ ప్రొటీన్లు లభిస్తాయి. అయితే చికెన్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
బరువు తగ్గడానికి చికెన్ ఎలా తినాలంటే..
బరువు తగ్గాలనుకునే వారు చికెన్‌ను తినకుండా వివిధ రకాల చికెన్‌లను తీసుకోవవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. బరువు తగ్గడానికి, చికెన్ సూప్, చికెన్ రోల్స్, గ్రిల్డ్ చికెన్ తినవచ్చు. ఇది కాకుండా, రోజూ వారి ఆహారంలో చికెన్ లో పెరుగుని చేర్చడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. అంతే కాదు బరువు తగ్గడానికి వారానికి రెండుసార్లు 100 గ్రాముల చికెన్ తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.