చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్, స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో వాడే ఆవాల నూనె చాలా బాగా పనిచేస్తుంది. దీని ఉపయోగం కొన్ని సాధారణ వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, కొన్ని తీవ్రమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చలికాలంలో ఆవనూనెను ఉపయోగించడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఆవనూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు మనకు అనేక వ్యాధులను ఎదుర్కోవడంలో మేలు చేస్తాయి. చలికాలంలో మస్టర్డ్ ఆయిల్ మనకు ఔషధంలా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి సాధారణ వ్యాధుల నుండి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వరకు కూడా పనిచేస్తుంది. కావున చలికాలంలో ఆవనూనె వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- జలుబు, దగ్గు, ఫ్లూలో మేలు చేస్తుంది: చలికాలంలో జలుబు సమస్య సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది, శ్లేష్మం కూడా బయటకు వస్తుంది.
- ముక్కు మూసుకుపోయినట్లయితే వేడి నీటిలో ఆవాల నూనె వేసి ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఆవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి, కాసేపు ఉడికించి, ఒక పాత్రలో ఉంచి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కలను మీ ముక్కులో వేయండి. దీని వల్ల జలుబు నుండి చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు.
- గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: ఆవనూనెలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్‌ను యాభై శాతం తగ్గిస్తాయి. అందువల్ల, మీ ఆహారాన్ని ఆవనూనెతో తయారు చేసుకోండి.
- ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది: గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఆర్థరైటిస్ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చేతులు, కాళ్ల వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
- క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందవచ్చు: ఆవ నూనె క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది., కావున మీ ఆహారంలో ఆవ నూనెను మాత్రమే ఉపయోగించండి. అంతే కాకుండా, ఈ నూనెను ఉపయోగించడం వల్ల ఆస్తమా, దగ్గు, పంటి నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.