చలికాలంలో దోమలు వేధిస్తున్నాయా.. ఇంటి చిట్కాలతో ఇలా తరిమేయండి.. చంపేయండి..!

శీతాకాలం వచ్చింది.. చలి ఇరగదీస్తుంది.. ఫ్యాన్​ ఆన్​ చేస్తే చాలు గజగజ వణకాల్సిందే.. ఫంకా ఆపామా.. చెవి దగ్గర గుయ్​ అంటూ దోమలు చికాకు పుట్టిస్తాయి.  ఇక అవి కుట్టాయా అంటే రోగాలు సరేసరి... దోమలు కుట్టకుండా.. దుప్పటి కప్పుకుంటాం.. నిద్రలో అటూ కదిలి దుప్పటి కాస్త పక్కకు జరిగిందా.. దోమలు రక్తాన్ని పీల్చేస్తాయి... ఇలా కాకుండా దోమల బెడద నుండి కాపాడుకోవాలంటే.. ఇవిగో.. ఈ చిట్కాలు ఓసారి ట్రై చేసి చూడండి.

Also Read :- మీ పిల్లలకు షుగర్ ఉందా లేదా అనేది ఇలా తెలుసుకోండి

  • యూకలిప్టస్ ఆయిల్: యూకలిప్టస్ ఆయిల్​వాటర్​ లో  మిక్స్ చేసి, ఆ నీళ్లతో ఇంటిని క్లీన్ చేస్తే దోమలు ఇంట్లోకి రావు.
  • చెమట పట్టకుండా: బయట తిరిగొచ్చిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. లేదంటే చెమట పట్టినవారిని కుట్టేందుకు దోమలు ఇష్టపడతాయి. వీలైతే స్నానం చేసే నీటిలో రెండు యూకలిప్టస్ డ్రాప్స్ వేసుకోవాలి..
  • లెమన్ డ్రాప్స్ : నిమ్మరసాన్ని చర్మానికి రాసుకోవాలి. దాని వాసనలకు దోమలు మన దగ్గరకు రావు.
  • డార్క్​ క్లాత్స్​: ఈ క్లాత్స్​ తో శరీరాన్ని  పూర్తిగా కవర్ చేసుకోవాలి... శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులనే వేసుకోవాలి. డార్క్​ కలర్​ ను దోమలు తొందరగా దగ్గరగా రావని పరిశోధకులు అంటున్నారు. బ్రైట్ కలర్ క్లాత్స్ దోమలను ఆకరిస్తాయి.
  • గార్లిక్ జ్యూస్: ఓ గ్లాస్ నీటిలో వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించాలి. ఆ నీటిని శరీరానికి రాసుకోవాలి. అయితే. కళ్ల దగ్గర రాసుకునేముందు జాగ్రత్తగా రాయాలి.

–వెలుగు, లైఫ్​–