కబరస్థాన్, షాదీఖానాలు, మసీదుల అభివృద్ధి కోసం కృషి చేస్తా: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా: మందమర్రి అస్రా మసీద్లో ముస్లింల జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పాలుపంచుకున్నారు. ఎంపీ వంశీ కృష్ణను ముస్లిం పెద్దలు శాలువాతో సన్మానించారు. 

కబరస్థాన్, షాదీఖానాలు, మసీదుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎంపీ వంశీ కృష్ణ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎవరూ ఆపలేరని సీఎం ఇప్పటికే తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు.