అక్టోబర్ 22న సింగర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపిక : వరంగల్ శ్రీనివాస్

కరీంనగర్ టౌన్, వెలుగు: ‘నూరేండ్ల నా ఊరు గేయకావ్యం’ కోసం ఈ నెల 22న ఉమ్మడి  జిల్లా గాయకులను సిటీలోని  ఫిల్మ్ భవన్ లో ఎంపిక  చేయనున్నట్లు సినీ గేయ రచయిత, మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మీడియాతో మాట్లాడుతూ వందేళ్ల  పల్లెచరిత్ర,  మానవజీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా తెలంగాణ యాసతో కూడిన విలువైన  సాహిత్యాన్ని  భావితరాలకు అందించాలనే  ఉద్దేశంతో  243చరణాల గేయకావ్యాన్ని  రచించామన్నారు. 

ఈ గేయకావ్యాన్ని 243  మంది సింగర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పాడించాలనే  ఆలోచనతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల  నుంచి ఎంపిక చేసే  కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలిపారు. ఈ గేయకావ్యంలో పాడే అవకాశాన్ని ఉమ్మడి జిల్లా గాయకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయనతోపాటు మురళీ మధు, అనిల్, శంకర్ బాబు, మల్లిక్ తేజ, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అభి, శంకర్, నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.