ప్రతి నియోజకవర్గానికి 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దు.
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి

చౌటుప్పల్ వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు పెద్దపీట వేస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపాడు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో సర్వేల్ బాలుర గురుకుల పాఠశాలలో 18.61 కోట్లతో నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు స్కూల్ యాజమాన్యం పూర్ణకుంభంతో రాజగోపాల్ రెడ్డికి స్వాగతం పలికారు. 

అనంతరం సర్వేల్ గురుకుల పాఠశాల కు 44 ఎకరాలు స్థలం దానం చేసిన మద్ది నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాడు. అనంతరం నూతనంగా నిర్మించిన స్కూల్ భవనం, డార్మెటరీ హాల్, ఆడిటోరియంలను  పరిశీలించి సూచనలు చేశాడు. అనంతరం మాట్లాడుతూ గత పదేళ్ళలో గురుకుల పాఠశాలలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లను ఏర్పాటు చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తుందని అని తెలిపారు. నియోజకవర్గంలో 30 స్కూళ్లను సర్వేల్ గురుకుల పాఠశాల విధంగా  చర్యలు తీసుకోవాలని అని తెలిపారు. గురుకుల సెక్రటరీ రమణకుమార్, డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, డీఈఓ  సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  శైలజ, డీఈ  శివకుమార్, అల్యూమి అధ్యక్షుడు డాక్టర్ నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.