జగదీశ్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర మాది 
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్, వెలుగు : తనతోపాటు తన సొదరుడు వెంకట్‌‌‌‌ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.  బుధవారం చౌటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో రూ. 1.18 కోట్లతో నిర్మించిన హై లెవెల్ వంతెనను ప్రారంభించారు. అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో షిప్ యార్డ్, ఎల్లం బాయ్, కైతాపురం గ్రామాల్లో కొత్త జీపీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర తమదని

 కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకోలేదని కామెంట్ చేశారు.  తెలంగాణ ఏర్పడకముందు జగదీశ్ రెడ్డి ఆస్తి ఎంత..?  ఇప్పుడున్న ఆస్తి ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోని ప్రతి నాయకుడు అవినీతి చేసి వేలకోట్లకు పడగలెత్తారని విమర్శించారు. చౌటుప్పల్ మండలంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని, వాటిని సర్వే చేయించి అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ వెన్  చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కాట్రేవు సర్పంచ్, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహ, పబ్బు రాజు గౌడ్, మోగుదాల రమేశ్ పాల్గొన్నారు.

సేవాభావంతో విద్య అందించాలి

చండూరు, మర్రిగూడ, వెలుగు :  విద్య, వైద్యాన్ని సేవ భావంతో పేదలకు అందించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థలో నిర్వహించిన 44వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్లాస్ రూమ్‌‌‌‌లు లేక చెట్ల కిందనే చదువుకున్నామని గుర్తుచేసుకున్నారు.  విద్య విషయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారం ఎల్లవేళలా ఉంటుందని, ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే పేద విద్యార్థులకు సపోర్ట్‌‌‌‌ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు, జబర్దస్త్ ఆర్టిస్టులు గడ్డం నవీన్, వినోద్ , శాంతి కుమార్ స్కిట్స్ ఆకట్టుకున్నాయి.

అనంతరం ఎమ్మెల్యే మర్రిగూడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌‌‌‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస్,  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్  ప్రతిష్ట చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, నల్గొండ డీఈవో బిక్షపతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాలా ప్రభాకర్ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కాందాల పాపిరెడ్డి, ఆర్డీవో దామోదర్ రావు, సీఐ వెంకటయ్య, ఎంఈవో గురవరావు, ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఎస్సై సురేశ్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.