స్మార్ట్ సిటీ పనులను గడువులోగా పూర్తి చేయాలి : చాహత్ బాజ్ పాయ్

  •     కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాలు

కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్ ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగడంపై 'స్మార్ట్ వర్క్స్ వెరీ స్లో'  అనే హెడ్డింగ్ తో ‘వీ6 వెలుగు’లో గురువారం స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. స్పందించిన బల్దియా కమిషనర్ శుక్రవారం సిటీలోని పలు డివిజన్లలో సుడిగాలి పర్యటన చేశారు. పెండింగ్ పనులను పరిశీలిస్తూ స్మార్ట్ సిటీ ఆర్వీ ప్రతినిధులు, ఏజెన్సీ కాంట్రాక్టర్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్లకు సూచనలు చేశారు.

మల్టీ పర్పస్ పార్క్, రాజీవ్ పార్క్, పద్మానగర్ లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సందర్శించి, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఫైనల్ స్టేజ్ లో ఉన్న మల్టీపర్పస్ పార్క్, రాజీవ్ పార్కు, పద్మానగర్ సమీకృత మార్కెట్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం 45,45 డివిజన్ లలో బతుకమ్మ నిమజ్జనం రూట్ ప్యాచ్ వర్క్ పనులను తనిఖీ చేశారు.