వైకుంఠధామాన్ని పరిశీలించిన మున్సిపల్ ​చైర్​ పర్సన్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్​ బోర్డు కాలనీలో ఉన్న వైకుంఠధామాన్ని సోమవారం మున్సిపల్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ పరిశీలించారు. పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. వాటర్​ ప్రాబ్లమ్​, లైటింగ్​ సమస్యను పరిష్కరిస్తానన్నారు. కమిషనర్​ సుజాత, ఏఈ శంకర్​, శానిటరీ ఇన్స్​పెక్టర్​ రవీందర్, కౌన్సిలర్లు శివకృష్ణమూర్తి, అన్వర్​హైమద్​, వంశీ తదితరులు ఉన్నారు.