Viral Video:నా కారునే ఢీకొడతావా..క్యాబ్ డ్రైవర్ను నేలకు కొట్టిన ఆడి ఓనర్

నా కారునే గుద్దుతావా..ఎంత ధైర్యంరా నీకు..అని చెంప పగలగొట్టాడు.అంతటితో ఊరుకున్నాడా..అమాంతం లేపి తలగిందులుగా నేలకేసి కొట్టాడు..పాపం అతను పడ్డవాడు మళ్లీ లేవలె.. కారు పార్కింగ్ దగ్గర వచ్చిన గొడవ క్యాబ్ డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన ముంబైలో జరిగింది. 

ముంబైలో ఆడికారును వెనక నుంచి ఢీకొట్టాడని ఓ వ్యక్తి..ఓలా క్యాబ్ డ్రైవర్పై విచక్షణరహితంగా దాడి చేశాడు. క్యాబ్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.  ఘట్ కోపర్ ప్రాంతంలో ఓ లా  క్యాబ్ డ్రైవర్ పై దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కయాముద్దీన్ ఖురేషి అనే క్యాబ్ డ్రైవర్ తన టాక్సీని ఘట్ కోపర్ లోని అసల్ఫా ప్రాంతంలో నడుతుపుతున్నాడు. ఓ లైన్ లో వెళ్తుండగావెనకునుంచి కొద్ది డి కారు యజమాని రిషబ్ బిభాష్ చక్రవర్తి చెంపపై కొట్టినట్లు కనిపిస్తుంది..అంతటితో ఆగకుండా కయాముద్దీన్ అమాంతం లేపి తలకిందులుగా నేలకు కొట్టాడు.. జనం గుమి కూడటంతో నిందితులు అక్కడిన వెళ్లిపోయారు. 

తీవ్రగాయాలైన కయాముద్దీన్ ను ఆస్పత్రి తరలించారు పోలీసులు. క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన రిషబ్ బిభాష్ , అతని భార్యపై కేసు నమోదు చేశారు.