IPL 2025 Mega Action: చెన్నై to ముంబై.. భారీ ధర పలికిన ధోని శిష్యుడు

ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారత ఫాస్ట్ బౌలర్.. స్వింగ్ కింగ్ దీపక్ చాహర్ కు భారీ ధర పలికింది. అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా రూ. 9.25 కోట్ల రూపాయలకు అతన్ని సొంతం చేసుకుంది. కనీస ధర రూ. రూ.2 కోట్ల రూపాయలతో వేలంలోకి వచ్చిన చాహర్ కోసం ముందు నుంచి ముంబై వేలంలో దూకుడును ప్రదర్శించింది. ఈ భారత బౌలర్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుందని భావించినా అది కుదరలేదు. కొన్ని సీజన్ లు గా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్న చాహర్ ఈ క్రమంలో చాలా మ్యాచ్ లకు దూరమయ్యాడు. 

అదే సమయంలో ఫామ్ కోల్పోవడంతో చాహర్ ను చెన్నై వదిలేసుకుంది. అంతకముందు మెగా ఆక్షన్ లో దీపక్ చాహర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లు పెట్టి తీసుకున్న చెన్నై.. ఈ సారి అతని కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై, చెన్నైతో పాటు పంజాబ్ కింగ్స్ కూడా చాహర్ ను తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ముంబై జట్టులో బుమ్రా, బోల్ట్ ఉండగా చాహర్ రాకతో ఆ జట్టు మరింత దుర్బేధ్యంగా మారింది. కొన్ని సీజన్ లుగా చెన్నై జట్టులో ఓపెనింగ్ బౌలర్ గా చాహర్ అద్భుతంగా రాణించాడు.