- కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం.. రబీ సీజన్ నుంచే అమలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ
- ఈ ఏడాది జులై 1 నుంచే అమలు
- ‘పీఎం ఆశా’ స్కీమ్‌కు 35వేల కోట్లు
- నాన్యూరియా ఎరువులకు24,475 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, పెన్షనర్స్‌కు దీపావళి పండుగ వేళ కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది. వారి డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచేందుకు నిర్ణయించింది. 2025-–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధర ను పెంచింది. గోధుమసహా 6 పంటల ఎంఎస్పీ పెంపునకు ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ వివరాలను సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనంపై డీఏ 50 నుంచి 53 శాతానికి పెరగనున్నది. ఈ నిర్ణయం వల్ల కోటికిమందికి పైగా ప్రయోజనం చేకూరనున్నది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.9,448 కోట్ల ఆర్థిక భారం పడనున్నది. కాగా, ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలపై డీఏను 4% పెంచి, 50% చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమలవుతున్నది.
ఆవాలకు అత్యధికంగా రూ.300 ఎంఎస్పీ పెంపు
2025–26 మార్కెట్ సీజన్‌కు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. గోధుమ సహా 6 పంటల ఎంఎస్పీని హైక్ చేసింది. రబీ సీజన్‌లో కీలక పంటల సాగును ప్రోత్సహించేందుకు, రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నది. గోధుమపై కనీస మద్దతు ధరను తాజాగా క్వింటాల్‌కు రూ.150 పెంచడంతో ఎంఎస్పీ ప్రస్తుతం రూ.2,425కు పెరిగింది.
ఆవాల కనీస మద్దతు ధరను రూ.300 పెంచగా.. ఎంఎస్పీ రూ.5,950కి పెరిగింది. ఎర్ర కందులు క్వింటాల్‌పై రూ.275, శనగలకు రూ.210, కుసుమలకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచారు. అన్నదాతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’ (పీఎం ఆశా) స్కీమ్‌కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.
రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం.. రబీ సీజన్ నుంచే అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ ఈ ఏడాది జులై 1 నుంచే అమలు‘పీఎం ఆశా’ స్కీమ్‌కు 35వేల కోట్లు నాన్యూరియా ఎరువులకు24,475 కోట్ల సబ్సిడీ