పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో.. నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా: ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.  8 వేల కోట్లతో రామగుండం జెన్కో లో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టువదలని విక్రమార్కుడు రాజ్ ఠాకూర్.. పవర్ ప్లాంట్ ఏర్పాటు శుభపరిణామం అన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో సుమారుగా 2వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. 

ప్లాంట్ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.  అలాగే కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ లో మాట్లాడినట్లు చెప్పారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసిందన్నారు వంశీకృష్ణ.  ఇచ్చిన మాట ప్రకారం  కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు.

 సింగరేణి కార్మికులకు అన్యాయం: శ్రీధర్ బాబు

కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కృషి ఎంతో ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.  8 వేల పై చిలుకు కోట్లతో ప్లాంట్ నిర్మాణానానికి  ప్రభుత్వం ప్రకటన చేయడం సంతోషమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా పూర్తి చేస్తామన్నారు.  రామగుండం ప్రాంతంలో నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాల కల్పన చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు నింపే ప్రయత్నం చేయబోతున్నామని తెలిపారు.  గత బీఅర్ఎస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు శ్రీధర్ బాబు

ALSO READ | బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల పాలు చేసింది: MP వంశీకృష్ణ