దళితులకు ఏ ఇబ్బందున్న అండగా ఉంటాం: MP వంశీకృష్ణ

పెద్దపల్లి: దళితులకు ఏ ఇబ్బందున్న అండగా ఉంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మంథనిలో దళిత ఉద్యమకారుడు బోగే రాజారాం 3వ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో ఇవాళ (సెప్టెంబర్ 25) గడ్డం వంశీ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకులు బోగె రాజారామ్ అని కొనియాడారు.

 దళిత వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులనైన ఎదుర్కొని వారి అండగా నిలిచిన నాయకుడు భోగే రాజారామ్ అని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బోగే రాజారాం కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. పేద విద్యార్థులకు ఎలాంటి డొనేషన్ లేకుండా కాకా ఆధ్వర్యంలో హైదరాబాద్‎లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కళాశాలలో  చదువుకుని ఇవాళ ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లుగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నారని ఈ  సందర్భంగా వంశీకృష్ణ గుర్తు చేశారు.