పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీ, వివేక్ వెంకటస్వామి పర్యటన

పెద్దపల్లి/సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి బుధవారం విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని పలు మండలాల్లో వివాహ, గృహ ప్రవేశ వేడుకలకు హాజరయ్యారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కేంద్రంలో నార్ల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గృహ ప్రవేశానికి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం మంగళవారం చనిపోయిన సీనియర్​ జర్నలిస్టు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

అలాగే ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన రాజు–రజితల పెండ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మంథనిలో కాంగ్రెస్​ సీనియర్​ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో పర్యటించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలో మాజీ జడ్పీటీసీ మినుపాల స్వరూప–ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు గృహ ప్రవేశానికి హాజరయ్యారు. 

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలో పల్లె ప్రశాంత్ నానమ్మ పల్లె కేశమ్మ ప్రథమ వర్ధంతికి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిరుదు సమత, లీడర్లు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అన్నయ్య గౌడ్, సజ్జద్, బాలసాని సతీశ్​గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎం.రవీందర్, అబ్బయ్య గౌడ్, చిలుక సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుమార్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.