తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు .. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ ఆర్థిక సాయం 

పెద్దపల్లి, వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆర్థిక సాయం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండలం ఆశన్నపల్లికి చెందిన మంద ఐలయ్య ఏడు నెలల కింద అనారోగ్యంతో చనిపోగా.. రెండు రోజుల కింద అతని భార్య భాగ్య కూడా మృతిచెందింది. దీంతో వారి కొడుకు అభిలాష్​, కూతురు మనీష అనాథలయ్యారు.

ఈ విషయమై గ్రామానికి చెందిన మంద అన్వేష్​, మాజీ సర్పంచ్​ వెంకన్న మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వారు పిల్లలకు రూ. 10 వేలు ఆర్థిక సాయం పంపించారు.