పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం 

పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోకు గురువారం కాంగ్రెస్ లీడర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్లం సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ  ఓదెల రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ టూ తిరుపతి ఎక్స్​ప్రెస్​,  కాజీపేట్ టూ బల్లార్షా  అజ్నీ ఎక్స్​ప్రెస్​ రైళ్లను ఓదెలలో ఆపాలని పార్లమెంటులో మాట్లాడం హర్షనీయమన్నారు.

అలాగే గతంలో హాల్టింగ్​ ఉండి కరోనా టైంలో రద్దయిన రైళ్లకు ఇక్కడ ఆపేలా మాట్లాడడంపై కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. లీడర్లు గోపతి ఎల్లయ్య, మార్క సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోయ సంతోష్, గుర్రాల శ్రీధర్,  కోటగిరి స్వామి, రాచర్ల ఓదెలు పాల్గొన్నారు