చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: ఎంపీ గడ్డం వంశీ

పెద్దపల్లి: ఇటీవల అత్యాచారానికి గురై హత్య చేయబడిన చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో జరిగిన ఘటన స్థలాన్ని జూన్ 16వ తేదీ ఆదివారం మంత్రులతో కలిసి ఆయన పరిశీలించారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఘటనకు పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలన్నారు.

నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు ఎంపీ తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు  రెండు లక్షల రూపాయలు, రూ.50 వేల ఎక్స్ గ్రేషియా అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో రైస్ మిల్ ఓనర్ నుంచి ర.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని వంశీకృష్ణ తెలిపారు.