రేవంత్ సర్కార్‌ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్‌

నవీపేట్, వెలుగు: తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కూలిపోయి బీజేపీ ప్రభుత్వం రావాలని పూజలు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలో శనివారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

 అక్షింతలతో అయోధ్య రాముడికి పూజలు చేసినట్లుగానే.. రేవంత్ సర్కార్ కూలడానికి ప్రతి హిందువు ఇప్పటి నుంచి పూజలు చేయాలని కోరారు.  400 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్‌ ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడం పక్కా అని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సరిన్, ఎంపీటీసీ మైస రాధ పాల్గొన్నారు.