కలెక్టర్​పై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం! :ఎంపీ ధర్మపురి అర్వింద్

  • అధికారం పోయినా అతనిలో కొవ్వు కరగలేదు: ఎంపీ అర్వింద్ 

జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీజ్​జైన్​ పై జరిగిన దాడి ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉండే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. అధికారం పోయినా కేటీఆర్ లో కొవ్వు కరగలేదని, ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లినట్టుగానే కేటీఆర్ సైతం జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. లగచర్ల దాడి విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని కరెక్ట్​గా ఎంక్వయిరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడి విషయంలోనూ కేటీఆర్ హస్తం ఉందంటూ అతన్ని జైల్లో వేయడమే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు.