ఏముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తడు : ఎంపీ అర్వింద్

  • చెప్పులు, చీపుర్లతో ప్రజలు స్వాగతించాలె 
  • నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ 

​ నిజామాబాద్​, వెలుగు : కేసీఆర్​ ఎక్స్​పైరీ డేట్​దగ్గరపడ్డ లీడర్ అని,  పార్టీ నాయకత్వం చేపట్టడానికి హరీశ్​రావు, కేటీఆర్​ మధ్య  గొడవలు జరుగుతున్నాయని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధర్మపురి తెలిపారు.  ఆదివారం ఆయన బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. హరీశ్​​రావు పాదయాత్ర చేస్తానని చెప్పగానే ..  తానూ  పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఏ ముఖంతో ప్రజల మధ్యకు వెళ్తారని  ప్రశ్నించారు.  కేటీఆర్​ ఎప్పుడు వచ్చినా ప్రజలు చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకాలన్నారు. పదేండ్ల అధికారంతో కళ్లు నెత్తికెక్కి గాలిలో తేలిన  బీఆర్​ఎస్​ కాళ్లను నేలకు తాకించడానికి ఎలక్షన్​లో ప్రజలు ఓడించారని విమర్శించారు. 

కమీషన్ల కోసం ప్రాజెక్టులు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసి, భారీ కమీషన్లు వసూలు చేశారని ఫైరయ్యారు. జిల్లాలోని మంచిప్ప ప్యాకేజీ పనుల్లో భాగంగా 2100 కోట్లతో పైపులు కొని,  కాంట్రాక్టర్​కు లాభాలు కట్టబెట్టఇందని,  కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఇప్పుడక్కడ సర్వే షురూ చేసిందన్నారు.  మంచిప్ప ప్రాజెక్టు నిర్మిస్తే అనేక విలేజ్​లు మునిగి గిరిజనులు భూములు కోల్పోతారని అనారు.

కొబ్బరికాయలు కొట్టేందుకే సెంటర్లు ఓపెన్​

సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీలు  అమలు సాధ్యంకావని,   రుణమాఫీ, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్​ స్కీం కింద తులం బంగారం పేరుతో ప్రజలను ఆయన మోసం చేశారని హిందూ దేవుళ్లపై ఒట్లు పెట్టి ధర్మాన్నీ  చులకన చేశారన్నారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్​ కేసీఆర్​ను మించిపోయారని ఆయన్ను మిత్రుడిగా చెప్పలేకపోతున్నానన్నారు. కొబ్బరికాయలు కొట్టడానికే వడ్ల కొనుగోలు సెంటర్లు తెరిచారని , కొనుగోళ్లు మరిచారని విమర్శించారు.    

దేశానికి మజ్లిస్​ ఒక క్యాన్సర్​లాంటిదని అన్నారు.  కాంగ్రెస్​  రూపొందించిన  వక్ఫ్​బోర్టు చట్టానికి బీజేపీ సవరణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు.   ఈ కార్యక్రమంలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, ఫ్లోర్​ లీడర్​ స్రవంతిరెడ్ది, గంగాధర్​, శేఖర్​ పాల్గొన్నారు.