ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్

నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు  నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ .   మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి తలచుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు పట్టదని అర్వింద్ చెప్పారు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉందని..అవి కుడా ఎక్కువ రోజులు ఉండవన్నారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ తొందరగా కూలిపోవాలని మొక్కి వెళ్ళి ఓటెయాలని ప్రజలను కోరారు. వేల్పూర్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.. ఈ సంధర్భంగా  అరవింద్. దేశంలో హిందు, ముస్లింలకి లొల్లి నడుస్తలేదని..ఇస్లాం, ఇస్లాం వ్యతిరేకులకి మధ్య లొల్లి నడుస్తుందన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేయాలని ఉగ్రవాద సంస్థలు లెటర్స్ రాస్తున్నాయని అర్వింద్ ఆరోపించారు.