రామగుండం బల్దియాలో రోడ్ల విస్తరణపై కదలిక

  • ఏడేండ్ల కింద సర్వే, మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన అధికారులు 
  • తాజాగా  మళ్లీ రోడ్ల విస్తరణపై మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్​ఆమోదం
  • మరో నాలుగు నెలల్లో - ముగియనున్న పాలకవర్గ పదవీకాలం 
  • ఇరుకు రోడ్లతో అవస్థలు పడుతున్న జనం 

గోదావరిఖని, వెలుగు: రామగుండం మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ప్రధాన రోడ్ల విస్తరణపై కదలిక వచ్చింది. ఏడేండ్ల క్రితమే రోడ్ల విస్తరణకు మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వే చేసినా.. ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. తాజాగా కౌన్సిల్​ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లను విస్తరించాలని తీర్మానించడంతో ఈ ఇష్యూపై మళ్లీ కదలిక వచ్చింది. కాగా మరో నాలుగు నెలల్లో పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో రోడ్ల విస్తరణకు ముందుకు సాగేనా అని పట్టణవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇరుకు రోడ్లతో ట్రాఫిక్​కష్టాలు 

 గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలు లక్ష్మీనగర్, కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్వతంత్ర చౌక్, పాతఅశోక టాకీస్, రీగల్ షూ మార్ట్, గణేశ్​నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లు ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు పెరిగిపోయాయి. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో ట్రాఫిక్​ సమస్య తలెత్తుతోంది. షాపింగ్​కోసం వచ్చే వారి వాహనాలతోపాటు ఈ ఏరియాలో హాస్పిటళ్లు కూడా ఉండడంతో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవస్థలు తప్పడం లేదు. దీంతో దూర ప్రాంతాల్లో ఖాళీ జాగా చూసి పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి నడుచుకుంటూ వచ్చి షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాస్పిటళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి. 

2017లో సర్వే, మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయినా... 

రామగుండం బల్దియా పరిధిలోని ప్రధాన రోడ్లను విస్తరించేందుకు 2017లో అప్పటి పాలవర్గం ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేపట్టింది. ఈ ఏజెన్సీ సమర్పించిన ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వరంగల్ టౌన్ ప్లానింగ్ రీజియన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  సమర్పించారు. ఈ అంశంపై జనరల్ బాడీ సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపింది.

దీని ప్రకారం గోదావరిఖని అంబికా మెడికల్ స్టోర్స్ నుంచి లక్ష్మీనగర్​లోని అప్పటి దర్శిని హోటల్ ద్వారా పాపులర్ షూమార్ట్ వరకు 40 అడుగులు, గణేశ్​నగర్​ బోర్డు నుంచి లక్ష్మీనగర్​లోని విజయ పిల్లల హాస్పిటల్ వరకు 30 ఫీట్ల వెడల్పు, కల్యాణ్​నగర్​ నుంచి అడ్డగుంటపల్లి వరకు 60 ఫీట్లు, స్వతంత్రచౌక్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా హనుమాన్​ గుడి, అక్కడి నుంచి అడ్డగుంటపల్లిలోని త్రివేణి కాంప్లెక్స్ వరకు 40 ఫీట్లతో రోడ్డు వైడెనింగ్​ చేసేందుకు అధికారులు మార్కింగ్ చేశారు. వీటి విస్తరణకు సర్వే చేసి మార్కింగ్​ చేసినా ఆచరణకు నోచుకోలేదు.

కాగా ఈ రోడ్ల విస్తరణకు రూ.30కోట్లు ఖర్చయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐడీసీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.100కోట్ల నుంచి కేటాయించనున్నారు. ఈమేరకు ఇటీవల జరిగిన కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమోదం తెలపగా, రోడ్డు డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అప్రూవల్​ రావాల్సి ఉంది. అప్పుడే రోడ్ల విస్తరణపై ముందడుగు పడే అవకాశం ఉంది.