సారూ..నా కొడుకు బువ్వ పెడ్తలేడు!

 

  • ఠానా మెట్లెక్కిన వృద్ధురాలు
     
    కొడిమ్యాల, వెలుగు : కొడుకు, కోడలు బువ్వ పెడ్తలేరని ఓ వృద్ధురాలు గురువారం పోలీస్​స్టేషన్​మెట్లెక్కింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొనాపూర్ కు  చెందిన మధురమ్మ(80)కు కొడుకు, ఇద్దరు బిడ్డలున్నారు. భర్త ఇదివరకే చనిపోగా బిడ్డలకు పెండ్లిళ్లు చేసి పంపింది. కొడుకు మల్లేశం, సుజాత దగ్గర మధురమ్మ ఉంటోంది. గురువారం కొడిమ్యాల పీఎస్​కు వచ్చిన మధురమ్మ కొన్ని నెలలుగా తనకు కొడుకు, కోడలు అన్నం పెట్టడం లేదని, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన పేరుపై ఉన్న 60 గుంటల భూమిని కొడుకు వేరొకరికి కౌలుకు ఇచ్చి తనను పట్టించుకోవడం లేదని కంప్లయింట్​చేసింది. ఎస్ఐ సందీప్ కొడుకు, కోడల్ని పిలిపించి న్యాయం చేస్తానని మధురమ్మకు చెప్పారు.