యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా గుట్ట మండలం దాతరుపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెలులో ఒకేరోజు అత్తాకోడళ్లు చనిపోవడంతో విషాదం అలుముకొంది. గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ(65) కూలీ పనులు చేసేది. ఈమెకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు భార్య మంగమ్మ. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భారతమ్మ శనివారం తన తల్లిని చూడడానికి భువనగిరి మండలం రాయగిరికి వెళ్లింది. ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆమె డెడ్‌బాడీని గొల్లగుడిసెలుకు తీసుకువచ్చారు. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహం పక్కనే కుప్పకూలింది. దీంతో ఆమెను వెంటనే భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
గుండెపోటుతో అత్త మృతి మృతదేహం వద్ద ఏడుస్తూ కోడలు మృతి
- నల్గొండ
- March 18, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.