ఆస్పత్రి ఖర్చులన్నీ దాచుకున్న డబ్బుతోనే : ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ చేసుకోవటంలో ఇబ్బందులు

భారతదేశంలో అనారోగ్యం వస్తే.. ఆస్పత్రి బిల్లులు, ఖర్చులతోనే మధ్య తరగతి కుటుంబాలు దివాళా తీస్తున్నాయంట.. ఈ మాట మేం అంటున్నది కాదండీ.. ఇన్సర్ టెక్ అనే కంపెనీ నిర్వహించిన సర్వేలో వెలుగుచూసిన కఠోర నిజం.. అవును.. 71 శాతం ఉద్యోగులు తమ వైద్య ఖర్చుల కోసం జేబులోని డబ్బు ఖర్చు పెడుతున్నారంట.. మరి ఇన్సూరెన్స్ లేదా అంటే.. ఉన్నా 43 శాతం మంది వాటిని క్లెయిమ్ చేసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారంట.. ఇండియాలో హెల్త్ కేర్.. ఆస్పత్రి ఖర్చులు.. ఇన్సూరెస్స్ అంశాలపై ఆ సంస్థ చేసిన సర్వేలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం...

>>> 71 శాతం ఉద్యోగులు ఆస్పత్రి ఖర్చులను తమ సేవింగ్స్ నుంచి ఖర్చు చేస్తున్నారు. 
>>> సాధారణ ఓపీ 300 రూపాయలుగా ఉంటే.. స్పెషలిస్ట్ డాక్టర్ ఓపీ వెయ్యి రూపాయలుగా ఉంది. 
>>> కనీసం ల్యాబ్ ఛార్జీ.. అంటే డాక్టర్ రాసే కనీసం వైద్య పరీక్షలు 15 వందల రూపాయలుగా ఉంటే.. గరిష్ఠంగా ఇది 25 వేల రూపాయల వరకు ఉంటుంది. 
>>> 2008 నుంచి 2024 మధ్య కాలంలో ఆరోగ్యంపై చేసే ఖర్చు 16 శాతం వరకు పెరిగింది. 
>>> 2008లో దేశంలోని ప్రజలు తమ ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు 2 లక్షల 43 వేల కోట్లుగా ఉంటే.. అది 2024 నాటికి 5 లక్షల 85 వేల కోట్ల రూపాయలుగా ఉంది. 
>>> వైద్యం కోసం భారతీయులు చేసే అప్పు 14 శాతంగా ఉంది.. ఇది చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల కంటే భారత్ లోనే ఎక్కువగా ఉంది. 

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ లపై తికమక :

భారతీయులు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా.. దానికి వినియోగించుకునే విధానంపై అవగాహన లేకపోవటం అనేది పెద్ద సమస్యగా ఈ సర్వే స్పష్టం చేస్తుంది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ALSO READ | ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 13 ఐపీఓలు

>>> ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన వారిలో 43 శాతం మంది.. వాటిని ప్రాసెస్ చేయటానికి చాలా కష్టపడుతున్నారు. కొన్నిసార్లు ప్రాసెస్ చేయటంలో విఫలం అయ్యి.. క్లెయిమ్ చేయటం లేదు. 
>>> హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదిలోనే 25 శాతం వరకు పెరిగిందని.. 52 శాతం మంది చెప్పటం విశేషం. 
>>> హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా.. అది ప్రభుత్వం లేదా ప్రైవేట్ కంపెనీల పాలసీలు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవటం 30 శాతం మంది విఫలం అవుతున్నారు. దీంతో హెల్త్ పాలసీ ఉన్నా సొంత డబ్బులనే ఆస్పత్రి బిల్లులకు ఖర్చు చేస్తున్నారు. 

హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న 70 శాతం మంది.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులభతరంగా ఉండాలని.. వాటిని వినియోగించుకోవటం.. క్లెయిమ్ చేసుకోవటంలో తికమక పడుతున్నారని.. సరైన విధానం లేదనే అభిప్రాయం వ్యక్తం చేయటం విశేషం. మధ్య తరగతిలోని చాలా కుటుంబాలు ఆస్పత్రి ఖర్చులతో దివాళా తీస్తున్నారని కూడా ఈ సర్వే చెప్పటం విశేషం.