క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే చాలా వరకు మరణాలను ఆపొచ్చు. అలా గుర్తించేందుకు వీలుగా కొన్ని ఇన్వెన్షన్లు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. అలాగే క్యాన్సర్ బారిన పడ్డాక కొన్ని రకాల కేర్ అవసరం. ఆ కేర్‌కు సంబంధించి కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని కూడా కొత్తగా తయారుచేస్తూనే ఉన్నారు.
ఇండియాలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువ. ఆ తరువాత సర్విక్స్, అండాశయ, కార్పస్ యుటెరి క్యాన్సర్లు ఉంటున్నాయి.
థర్మాలిటిక్స్
నిరమయ్ అనే సంస్కృత పదానికి ‘జబ్బులు లేని’ అని అర్థం. ఆ పేరు పెట్టుకున్న సంస్థ థర్మాలిటిక్స్ సాయంతో క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే టెక్నాలజీ కనుక్కొంది. ఈ టెస్ట్‌కు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు” అన్నారు రీసెర్చ్ సైంటిస్ట్, నిరమయ్ సంస్థ ఫౌండర్ గీతా మంజునాథ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే దీనివల్ల రేడియేషన్ బారిన పడరు. శరీరం మీద కోత లేకుండానే తొలి దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించొచ్చు.
థర్మల్ ఇమేజింగ్ ద్వారా ఛాతి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపెడుతుంది ఈ డివైజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉష్ణోగ్రతలను క్యాన్సర్ స్క్రీనింగ్ రిపోర్ట్‌కు సరఫరా చేస్తుంది. అది ఉష్ణోగ్రతల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నాయా? లేదా? చెప్తుంది. ఈ టెస్ట్‌లో తేడా ఉంటే మమ్మోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ టెస్ట్‌లకు వెళ్లొచ్చు. అనుమానంతో వందల మంది మమ్మోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవడాన్ని తప్పిస్తుంది ఈ డివైజ్. ఇది యూనివర్శల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సొల్యూషన్.
సర్విచెక్
సర్వైకల్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స చేయడం ఈజీ. పూర్తిగా నయం చేయొచ్చు కూడా. ఇమ్యూన్ సిస్టమ్ మూమూలుగా ఉన్న మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అయ్యేందుకు 15 నుంచి 20 ఏండ్ల టైం పడుతుంది. అదే ఇమ్యూన్ సిస్టమ్ అంత బాగా లేని వాళ్లలో ఐదు నుంచి పదేండ్లలో సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. వడోదరకు చెందిన అనిర్బన్ పాలిట్, తన భార్య డాక్టర్ సయాంతని ప్రామాణిక్‌తో కలిసి ‘సర్విచెక్’ అనే డివైజ్ తయారు చేశాడు. సెల్ఫ్ శాంప్లింగ్ కిట్‌తో ఇంట్లోనే సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఇంట్లోనే శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కిట్ హెచ్పివి(హ్యూమన్ పాలిల్లోమావైరస్)ను గుర్తించడంలో సరైన రిజల్ట్ ఇస్తుంది. ఇదొక్కటే కాకుండా గైనకాలజిస్ట్‌లకు సర్వైకల్ క్యాన్సర్ చికిత్స చేసే స్టేజిలో ఉందో .. లేదో.. కూడా చెప్తుందన్నాడు అనిర్బన్
సాయిషా ఇండియా
ముంబయికి చెందిన జయశ్రీ రతన్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ కోసం క్రొషెట్ బ్రెస్ట్తయారుచేసింది. ‘‘కాటన్‌తో వీటిని తయారుచేయడం వల్ల మెత్తగా ఉంటుంది. అలర్జీలు రావు. చేత్తో ఉతుక్కోవచ్చు. మాస్టెక్టమీ బ్రాలో సరిగా ఫిట్ అవుతుంది కూడా. కొందరు మహిళలు సిలికాన్ బ్రెస్ట్ వాడతారు. కానీ చాలామంది ఫుల్ బ్రెస్ట్ అప్పియరెన్స్ కోసం హ్యాండ్ కర్చీఫ్, కాటన్ ఉండలు బ్రాలో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ర్యాష్, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. చర్మం మీద ఒరుసుకుపోతుంది కూడా. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్‌కు సాయం చేసేందుకు క్రొషెట్ ప్రొస్తసిస్లు తయారుచేస్తున్నా” అంటోంది జయశ్రీ.
మమ్మొమొబైల్
కాగ్నిటివ్ సైకో థెరపిస్ట్, సైంటిస్ట్ అయిన షాడి గంజ్.. క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. అందుకని తమిళనాడులోని పల్లెల్లో క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ఎంతోమంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఉంటారని బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ బస్ నడుపుతోంది. ఈ బస్‌లో మమ్మోగ్రామ్ మెషిన్, కంట్రోల్ రూమ్ ఉన్నాయి. మమ్మోగ్రామ్ రిజల్ట్‌ను వెంటనే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో సెక్షన్లో సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ కోసం ఒక గది ఉంది. మమ్మొమొబైల్ తమిళనాడులో 92 గ్రామాలకు వెళ్లింది. నెలకు 500 వరకు మమ్మోగ్రామ్స్ చేస్తోంది.
గంగా గోదావరి క్యాన్సర్ స్క్రీనింగ్
ఇండియాలో 2040 కల్లా కొన్ని లక్షల మంది మహిళల్లో యుటిరైన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అందుకని గంగా గోదావరి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా మహిళల్లో క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించేందుకు సాయం చేస్తోంది.
గంగా గోదావరి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా 2019 నుంచి 76 స్క్రీనింగ్ క్యాంపులు పెట్టారు. నాలుగువేల మంది మహిళలకు సాయపడ్డారు. 200 మందికి తొలిదశలో క్యాన్సర్ కనిపెట్టి, చికిత్స కోసం హాస్పిటల్స్‌కు పంపించగలిగారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ 2.3 మిలియన్ల మంది మహిళలు, వాళ్ల కుటుంబాల మీద ప్రభావం చూపింది. మా గోల్ 2024 వరకు ఐదు మిలియన్ల మందిని మా ప్రోగ్రామ్ ద్వారా చేరుకోవాలి అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు.ఏదేమైనా క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం అనేది ముఖ్యం. ఈ విషయం నేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.