Good Health: మెరుగైన ఆరోగ్యం కోసం రన్నింగ్​ ఎలా చేయాలో తెలుసా...

రన్నింగ్ ఆరోగ్యవంతమైన లైఫ్‌స్టైల్ కొనసాగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది , ఇది మీ శరీరాన్ని చురుకుగా చేస్తుంది. అలాగే, మీరు బరువు తగ్గాలనుకుంటే, రన్నింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రోజు పరిగెత్తిన తర్వాత , మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.  ఇప్పుడు అవేంటో చూద్దాం.

ఈ రోజుల్లో అందరికి వ్యాయామం అవసరం.... లేదంటే ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.  హైటెక్​ యుగంలో జనాలకు అంత టైం ఉండటం లేదు.  మార్నింగ్​ బెడ్​ పై నుంచి లేస్తేనే ఆఫీసు పనులు... ఇంటి పనులతో సతమతమవుతుంటారు.  అలాంటి వారు కచ్చితంగా ఉదయం  ఉదయాన్నే రన్నింగ్ అయిన అలవాటు చేసుకోవాలి.

రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంత అందరికీ తెలుసు. అందుకే చాలామంది జిమ్​ కు  వెళ్లడం కంటే రన్నింగ్ చేసేందుకే ఇష్టపడుతుంటారు. రన్నింగ్ వల్ల బాడీ ఫిట్ ఉండడమే కాదు. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అయితే.. రన్నింగ్ ఎలా పడితే అలా చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 

రన్నింగ్ చేసి వెంటనే కూర్చోకూడదు. పరుగు ఆపగానే కొంత టైం ఎక్సర్​సైజ్ లు చేయాలి. రన్నింగ్ తర్వాత కష్టమైన ఎక్సర్ సైజ్లు చేయకుండా ఈజీగా ఉండేవి చేయాలి. రన్నింగ్ మొదలు పెట్టేముందు...  తరువాత తప్పనిసరిగా నీళ్లు తాగాలి. కానీ.. మొదలు పెట్టడానికి అరగంట ముందు, ఆపేసిన తర్వాత 15 నిమిషాలకు తాగాలి. ఎందుకంటే రన్నింగ్ ఆపిన వెంటనే శరీరం చాలా వేడిగా ఉంటుంది. 

ALSO READ | Good Health : ట్యాబ్లెట్లు లేకుండానే.. ఈ ఆసనాలతో బీపీకి చెక్ పెట్టొచ్చు..!

రన్నింగ్​ ఆపిన వెంటనే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు నీళ్లు తాగడం మంచిది కాదు. కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత తాగాలి. నీళ్లు తాగకుంటే శరీరం డీ హైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. రోజంతా హార్డ్ వర్క్ చేసేవాళ్లు తక్కువ సమయం రన్నింగ్ చేయాలి. లేదంటే ఎనర్జీ లెవల్స్ బాగా తగ్గుతాయి. వెంటనే నీరసం వస్తుంది. రోజంతా యాక్టివ్​గా  పని చేయలేరు. అంతేకాదు రన్నింగ్ చేసేవాళ్లు ప్రతి రోజూ బ్రేక్​ ఫాస్ట్​ తప్పనిసరిగా చేయాలి. అది కూడా ప్రొటీస్లు ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది.

పరిగెత్తిన వెంటనే స్నానం చేయకూడదు

రన్నింగ్​ చేసిన  తర్వాత మీ శరీరం కాస్త వేడిగా మారుతుంది. చెమట ఎక్కువగా పడుతుంది. కావున తప్పనిసరిగా స్నానం చేయాలి. కానీ ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు. ముందుగా చెమటను ఆరబెట్టుకోవాలి, ఆ తర్వాత స్నానం చేయాలి కానీ స్నానం చేసిన వెంటనే ఏసీ లేదా కూలర్ ముందు కూర్చోకూడదని గుర్తుంచుకోవాలి.

రన్నింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.... అవేమిటంటే....

  • సరైన షూస్ వేసుకోవాలి
  •  ఒక రన్నింగ్ గ్రూప్ లో ఉండడం మంచిది
  •  రెగ్యులర్ గా ఒక రోజు హాలిడే  తీసుకోవాలి
  •  రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రెంత్ ట్రెయినింగ్ తీసుకోవాలి
  • సహనంగా ఉండాలి
  • హెల్దీ డైట్ తీసుకోవాలి

రన్నింగ్ అనేది ఒక ఫుల్ బాడీ వర్కౌట్. ఇక్కడ మీ జాయింట్స్ ఇంపాక్ట్ అవుతాయి. అందుకని, మీరు మీ బాడీని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉండాలి. రోజు విడిచి రోజు స్ట్రెంత్ ట్రెయినింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ స్ట్రెంత్ ట్రెయినింగ్ లో స్క్వాట్స్, లంజెస్, ప్లాంక్స్, పుషప్స్ చేయాలి. ఇందువల్ల మీ టెండన్స్, లిగమెంట్స్, మజిల్స్ రికవరీ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాయి.