ఈ స్పీడు యుగంలో.. తిండి కూడా స్పీడ్గా తయారైతే బాగుండు అనుకోవడం సహజం. అందులోనూ ఉదయాన్నే నిద్రలేచాక టైంతో పాటు పరిగెత్తాలి. అందుకే ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు బియ్యప్పిండితో తయారు చేసుకునే కొన్ని ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ వెరైటీలు మీకోసం...
రైస్ కిచ్చు
కావలసినవి:
బియ్యప్పిండి: 1 కప్ప
అల్లం తరుగు: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి తరుగు:1 టేబుల్ స్పూన్
కారం:1టీస్పూన్
ఉప్పు, నూనె-తగినంత
నీళ్లు 3 కప్పులు
కొత్తిమీర:2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
పొయ్యి మీద నాన్ స్టిక్ బాండీ పెట్టి 3 కప్పుల నీళ్లు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, సోడా ఉప్పు వేసి బాగా కలపాలి. పెద్ద మంటమీద 2 నిమిషాలు మరిగించాలి. తరువాత బియ్యపుపిండి వేసి ఉండలు కట్టకుండా కలపాలి. మూత పెట్టి చిన్న మంటమీద 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. మరొక బాండీ తీసుకొని అందులో కొంచెం నూనె వేయాలి. నూనె వేడయ్యాకు అల్లం తరుగు వేసి వేగించి స్టవ్ ఆపేయాలి. తరువాత అందులో కారం వేసి కలపాలి. ముందుగా చేసుకొన్న బియ్యప్పిండి మిశ్రమాన్ని సమ భాగాలుగా చేసి చిన్న చిన్న గిన్నెలో ఉంచాలి. దానిపై అల్లం,కారం వేగించిన నూనెను ఒక్కో గిన్నెలో ఒక్క స్పూన్ వేయాలి. పై నుంచి కొత్తిమీర చల్లితే తినేందుకు రెడీ.
క్రిస్పీ రైస్ బాల్స్
కావలసినవి:
బియ్యప్పిండి: 1/2
ఉల్లిగడ్డతరుగు: 1/4 కప్పు
క్యారెటీ తురుము : 1/2 కప్పు
పాలకూర తరుగు 1/4 కప్పు
అల్లం, పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
జీలకర: 1/2 టీస్పూన్
చక్కెర: సిటీస్పూన్
కారం: 1 టీస్పూన్
ఉప్పు, నీళ్లు: తగినంత
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
తయారీ:
ఒక గిన్నె తీసుకొని అందులో బియ్య ప్పిండి, అన్నం, ఉల్లిగడ్డతరుగు, క్యారెట్ తురుము, పాలకూర తరుగు, అల్లం పచ్చిమిర్చి షిస్ట్, జీలకర్ర, చక్కెర, కారం, కొత్తిమీద, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో కొంచెం నీళ్లు ముద్దలా కలపాలి. తరువాత దాన్ని చిన్న ఉండలుగా చేయాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో ఈ ఉండలు వేసి గోధుమ రంగులో వచ్చేంత వరకు వేగించాలి. వీటిని టమాటో సాస్ తో లేదా ఏదైనా చెట్నీతో తినాలి.
బియ్యప్పిండి దోశె
కావాల్సినవి:
బియ్యప్పిండి: 1/2 కప్పు
గోధుమ పిండి : 1/2కప్పు
జీలకర్ర: 1 టీస్పూన్
కరివేపాకుతరుగు: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్
నీళ్లు: 1 1/4 కప్పు
ఉల్లి తరుగు: 3 టేబుల్ స్పూన్లు
అల్లం తరుగు:1/2టీస్పూన్
పెరుగు: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
తయారీ:
ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు, కరివేపాకు ఉల్లిగడ్డ అల్లం తరుగు, జీలకర్ర వేసి కలపాలి. కొంచెం పెరుగు సరిపడినన్ని నీళ్లు పోసి కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి ఒక ఉల్లి గడ్డ ముక్కతో పెనంమీద రుద్దాలి. పెనం వేడయ్యాక ముందుగా పిసుకున్న పిండిని తీసుకొని అట్టులా వేసి రెండు వైపులా కాల్చాలి. వీటిని టొమాటో చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
చల్ల ఉప్మా
కావలసినవి:
బియ్యపుపిండి: 1/2 కప్పు
ఉల్లిగడ్డ తరుగు: 1/4 కప్పు
జీలకర్ర 1/2 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
ఎండుమిర్చి: 2
పచ్చిమిర్చి తరుగు: టేబుల్ స్పూన్
శెనగపప్పు: టీస్పూన్
మినమొప్పు: టీస్పూన్
కరివేపాకు 2 రెమ్మలు
ఉప్పు, నీళ్లు, నూనె: తగినంత
కొత్తిమీర: 2 టేబుల్ స్స్పూన్లు
తయారీ:
పొయ్యి మీద బాండీ పెట్టి అందులో కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి వేగించాలి. తరువాత మినపప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. తరువాత ఉల్లిగడ్డ పచ్చి మిర్చి తరుగు వేసి వేగాక ఒక కప్పు పిండికి 1కప్పు నీళ్లు వేయాలి. నీళ్లు మరిగాక బియ్యప్పిండిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దీన్ని సన్నని మంటమీద 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.. చివరగా కొత్తిమీద చల్లి వడ్డించాలి.