Good Health: స్నానం చేసే నీళ్లలో ఇది కొద్దిగా కలపండి.. ఆ సమస్యలన్నీ పరార్​ 

వర్షాకాలం ప్రారంభం అయింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరోగ్యం దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా చాలా మంది వేడి లేదా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే నీటిలో ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయన్న విషయం మీకు తెలుసా..? తెలియకపోతే తెలుసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు దూరమవడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఉప్పులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీనిని ఔషధల్లో కూడా ఉపయోగిస్తారు. ఉప్పును స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల శరీరంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు ఇందులో ఉండే ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. మృదువుగా మారి చర్మం నునుపుగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉప్పు నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ ఉప్పు నీటితో స్నానం చేస్తే ముఖంపై ముడతలు కూడా తొలగిపోతాయి.

కీళ్ల నొప్పులకు చెక్: ఉప్పునీరు కూడా కీళ్ల నొప్పులను (joint pain) తగ్గిస్తుంది. తలస్నానం చేసేటప్పుడు నీళ్లలో చిటికెడు ఉప్పు కలిపి రాసుకుంటే ఎముకల్లో చిన్నపాటి నొప్పులు పోతాయి. అది కాకుండా, మీ పాదాల నొప్పి ఉంటే గోరువెచ్చని ఉప్పు నీటితో కడుక్కోవడం ద్వారా ఖచ్చితమైన ప్రయోజనాన్ని పొందుతారు.

వేళ్ల మధ్య మురికిని తొలగిస్తుంది: ఉప్పు నీటితో చేయి, కాళ్ల వేళ్ల మధ్య పేరుకుపోయిన మురికిని తొలగించి మృదువుగా మార్చేలా చేస్తుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా చర్మానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరోవైపు ఉప్పు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది.

మొటిమలు : మొహంపై మొటిమలను వదిలించుకోవడానికి ఉప్పునీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శ్వేత రంద్రాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత శరీరంలోని మురికి సులభంగా బయటకు వస్తుంది. ఇలా చేస్తే బాడీ డిటాక్స్ వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. అలాగే, ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా మేలు చేస్తుంది.

స్కిన్​ బ్యూటీ : చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆహారం తీసుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తుంటారు. అంతేకాదు ముఖ సౌందర్యం కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే చర్మ కాంతికోసం ఆహారం ఎంత అవసరమో స్నానం చేయడం కూడా అంతే అవసరం. సాధారణంగా నీటిని పోసుకుని సబ్బు రాసుకుని స్నానం చేస్తే మాత్రమే శరీరంపై మురికి పోయి శుభ్రంగా అవుతుందని అనుకుంటారు. అయితే శరీరాన్ని వాడే సబ్బుతో మాత్రమే కాంతివంతంగా మార్చుకోవచ్చని నమ్ముతారు. 

ఒత్తిడిని తగ్గిస్తుంది: ఏదైనా విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే, ఖచ్చితంగా ఉప్పు నీటితో స్నానం చేయాలి. దీని నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఉప్పు నీటిలో ఉండే మినరల్స్ శరీరంలో శోషించబడతాయి. సోడియం మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంటారు. ఇది కాకుండా శరీరం డిటాక్స్ చేసినప్పుడు శరీరం నుంచి ఒత్తిడి కూడా విడుదల అవుతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ నీటితో స్నానం మంచి అనుభూతి చెందుతారు.

ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది : ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగించడానికి ఉప్పునీరు చాలా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఉప్పులో ఉండే మినరల్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని అన్ని రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల శరీరం పరిశుభ్రంగా మారుతుంది. అంతేకాదు మానసికంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు స్నానం చేసే సమయంలో కేవలం సబ్బు మాత్రమే కాకుండా ఉప్పును కూడా వాడితే శరీరం కాంతివంతంగా మారుతుంది. స్నానం చేసే సమయంలో ఆ నీటిలో ఉప్పును కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉప్పులో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఉప్పును కాసింత నీటిలో కలుపుకుని స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచే కాదు చర్మం కాంతివంతంగా మార్చుకోవడానికి కూడా తోడ్పడుతుంది.