Good Health:  వామ్మో.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..

మొన్న కృష్ణాష్టమి.. నిన్న వినాయక చవితి.. ఇప్పుడు గణపతి నిమజ్జనం.. ఇలా వరుసగా పండుగలొస్తున్నాయి. పండుగలన్నాక ఇంట్లో పూజలు కంపల్సరీ. పూజలన్నాక కొబ్బరికాయలు కొట్టడం కూడా కామనే. అయితే చాలాసార్లు ఈ కొబ్బరి వెంటనే తినరు. అలా కొన్నిరోజులు పెట్టి ఉంచడంవల్ల పాడైపోతుంటుంది. కానీ ఈ కొబ్బరిని ఎండబెట్టుకొని.. టైం దొరికినప్పుడల్లా తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఎండు కొబ్బరితో ఎన్నో ప్రయోజనాలున్నాయట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

కొబ్బరిలోపల వాటర్ కంటెంట్ పూర్తిగా ఆవిరైపోవడం వల్ల ఎండు కొబ్బరి మరింత రుచిగా ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుందని, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువేననే అభిప్రాయంతో చాలా మంది ఎండుకొబ్బరి తినడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే డ్రై కోకోనట్ వల్ల శరీరానికి కలిగే మేలు తెలిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటారు. ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్, సెలీనియంతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. ఈ హై స్యూట్రీషినల్ వాల్యూస్ వల్ల డ్రై ఫుడ్స్ లో  ఎండు కొబ్బరిని 'ది బెస్ట్' ఫుడ్ గా చెబుతారు. ఆరోగ్యంగా జీవించడానికి రెగ్యులర్ డైట్ లో ఎండు కొబ్బరిని కూడా భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు  ఆయుర్వేద నిపుణులు.  హెల్దీ లైఫ్ ను కోరుకుంటున్నట్లయితే కాంప్రమైజ్ కాకుండా ఈ రుచికరమైన ఆ రోమా డ్రై కోకోనట్ ను  రోజూ తినాలని సూచిస్తున్నారు. మరి డ్రై కోకోనట్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. . .

Also Read :- హైదరాబాద్ లో ఎర్ర చింతకాయల చెట్టు  ఎక్కడో తెలుసా

లావు తగ్గాలంటే, ఆరోగ్యంగాచలాకీగా ఉండాలంటే లేత కొబ్బరి తినాలని డాక్టర్లు చెబుతారు. లేత కొబ్బరిలో ఎన్నో ప్రోటీన్లు, ఎంజైములు  ఉంటాయి. కానీ ప్రతిరోజూ లేత కొబ్బరి దొరకడం కష్టమే కదా! నిజానికి లేత కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలోనే పోషకాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. ఎండు కొబ్బరి అరిగేందుకు కాస్త సమయం తీసుకున్నా.... దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావంటున్నారు పోషకాహార నిపుణులు.

హార్ట్ హెల్త్ ..

 డ్రైకోకోనట్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ కు  మేలు చేస్తుంది. మగవాళ్లకు రోజుకు కనీసం 38 గ్రాములు, ఆడవాళ్లను 25 గ్రాముల డైటరీ ఫైబర్ అవసరమవుతుంది.   ఇందుకోసం ఎండు కొబ్బరిని తినడమే ఉత్తమమని  ఆయుర్వేద  నిపుణులు చెబుతున్నారు. ఈ డైటరీ ఫైబర్ వల్ల గుండె సమస్యలు దూరమవుతాయంటున్నారు.

పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారిస్తుంది: 

ఇది అపోహకాదు, వాస్తవం. డ్రైడ్ కోకోనట్లో ఉండే మినరల్స్ పురుషుల్లో వంధ్యత్వ సమస్యలను నివారిస్తుంది. ఈ విషయాన్ని కొన్ని మెడికల్ టెస్టులు, పరిశోధనల ద్వారా నిరూపించారు. అందుకు కారణం కూడా సెలీనియమే. ఇది పురుషుల్లో ఇన్ఫెర్టిలిటిని తగ్గిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది..

మహిళలు ఒక వయస్సు వచ్చిన తర్వాత అనీమియాకు గురి అవుతుంటారు. ఐరన్ లోపం వల్ల తలెత్తే ఈ సమస్య అనేక అనారోగ్య సమస్య లకు దారితీస్తుం ది. డ్రైడ్ కోకోనట్లో ఐరన్ పుష్కలం. ఇది అనీమియాను నివారిస్తుంది.

కీళ్ల నొప్పులు దూరమవుతాయి..

 ఎండు కొబ్బరి రోజూ తింటే కీళ్లనొప్పుల సమస్య ఉండదు. కొబ్బరిలో ఉండే కొన్ని ఖనిజ లవణాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

ఎండు కొబ్బరిలో ఉండే న్యూటీషియన్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కొలన్, ప్రొస్టేట్ క్యాన్సర్లను నివారించడంలో డ్రైడ్ కోకోనట్ ఎంతో సహాయపడుతుంది.

జీర్ణ సమస్యలుండవు:

మితంగా ఎండుకొబ్బరి తినడం వల్ల మలబద్దకం, అల్చర్. హెమరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి. పైగా ఎండు కొబ్బరితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

బ్రెయిన్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది..

 డ్రై కోకోనట్ రోజూ తినేవారిలో మతిమరుపు తగ్గినట్లు  ఓ పరిశోధనలో తేలింది. దీనికి కారణం.. మెదడు పనితీరును మెరుగుపర్చే పోషకాలు ఎండు కొబ్బరిలో ఉండడమేననని తేల్చారు. . అంతేకాక మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కొబ్బరిలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయట.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.. 

ఎండు కొబ్బరిలో ఉండే మైక్రోగ్రామ్స్ వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక కోకోనట్ లో ఉండే సెలీనియం అనే ప్రోటీన్ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి.