వ్యాక్సిన్తో ఎక్కువ బెనిఫిట్స్

కరోనా వంటి ప్యాండెమిక్ వంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దానికి వెంటనే మెడిసిన్ కనిపెట్టడం చాలా అవసరం. అలా కనిపెట్టే ప్రాసెస్​లో ఆ మెడిసిన్​ వల్ల బెనిఫిట్స్, రిస్క్​లు చూస్తారు. నూటికి 95 శాతం బెనిఫిట్స్ ఉండి, 5 శాతం రిస్క్​ ఉంది అని తెలిసినప్పుడు కచ్చితంగా మెజారిటీ వైపే మొగ్గుచూపిస్తారు. అంతమందికి లాభం కలుగుతుంది అన్నప్పుడు డ్రగ్ కనిపెట్టడం సరైనదే అనే డెసిషన్​ తీసుకుంటారు. అలానే కొవిడ్​ వైరస్​తో పోరాడేందుకు కోవిషీల్డ్​ని.. స్పైక్ ప్రొటీన్​కి వ్యతిరేకంగా తయారుచేశారు. చింపాంజీ నుంచి సేకరించిన అడినో వైరస్ వెక్టార్ ద్వారా స్పైక్​ ప్రొటీన్​కి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇండియాలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్​లను అప్రూవ్​ చేశారు. కోవిషీల్డ్​తో పోలిస్తే కొవాగ్జిన్​ వల్ల సైడ్​ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి. 

కోవిషీల్డ్ మొదటి డోస్ ఇచ్చినప్పుడు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి వచ్చాయి. ఇలా దాదాపు 60 శాతం మందికి ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. తర్వాత రెండో డోస్ ఇచ్చినప్పుడు 6 శాతం మందికి ఎఫెక్ట్ అయ్యుండొచ్చు. అయితే ఒక ఏడాది తర్వాత రక్తం గడ్డకట్టిన కేసులు వచ్చాయి. నార్త్​ ఇండియాలో పొత్తికడుపు నొప్పితో చాలామంది హాస్పిటల్లో చేరారు. అందుకు కారణం.. కడుపులో పేగులకు రక్తం సరఫరా చేసే ఆర్టరీస్​లో రక్తం గడ్డ కట్టడం. దాంతో ఆ పేగు పాడవుతుంది. డయాబెటిస్, బీపీ, బ్లడ్ సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లలో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి.

అలాగే రెండో డోస్ తీసుకున్న వాళ్లలోనూ ఇలాంటి కేసులు వచ్చాయి. వాళ్లకు కొయాగ్యులేషన్ ప్రొఫైల్​ సజెస్ట్ చేశారు. అంటే ఈ టెస్ట్​లో రక్తం కారడం, గడ్డకట్టే టైం ఎలా ఉంది? ప్లేట్ లెట్ కౌంట్​ ఎలా ఉంది? వంటివి చెక్ చేస్తారు. ఎవరిలో అయినా ఇలాంటి పరిస్థితి ఉందని అనుమానిస్తే అల్ట్రా సౌండ్ డాప్లర్ అని ఒక టెస్ట్ చేసేవాళ్లం. లంగ్స్, హార్ట్​కి కాళ్ల నుంచే రక్తం సరఫరా అవుతుంది. కాబట్టి కాళ్లలో రక్తం గడ్డకట్టిందా? అని ఈ టెస్ట్​లో చూస్తాం.


కొవిడ్ వచ్చినప్పుడు నాలుగు నుంచి 14 రోజులు అబ్జర్వేషన్​లో ఉంచారు. ఆ తర్వాత ఐదు రోజుల నుంచి 12 రోజుల్లో బయటకు రావచ్చు. కరోనా వైరస్​ సోకడం వల్ల వెంటిలేటర్ పై ఉండాల్సిన పరిస్థితి, స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడడం, యాంటీ వైరల్ డ్రగ్స్ వాడడం, డీడైమర్ లెవల్ 900–1100 స్టేజ్​ నుంచి రికవర్ అయిన వాళ్లలో మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి వచ్చాయి. అంతేకానీ, సాధారణంగా త్వరగా కోలుకున్న వాళ్లలో ఇలాంటి కేసులు లేవు. ఇప్పటికీ హాస్పిటల్స్​లో వేరే ఏదైనా ట్రీట్​మెంట్ చేయాలన్నా కొవిడ్ వచ్చిందా? ఎన్ని రోజులకు తగ్గింది? ఏం ట్రీట్​మెంట్ తీసుకున్నారు? వంటివి తెలుసుకున్నాకే చేస్తున్నారు. 

ఆరోగ్యవంతులతో పోలిస్తే అప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్​ ఉన్నవాళ్లకు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డ్రగ్స్​కి అడిక్ట్ అయిన యువత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. బీపీ, డయాబెటిస్, స్ట్రోక్ వంటివి ఉంటే వాళ్లు ఒకసారి కొయాగ్యులేషన్, డీడైమర్ టెస్ట్​లు చేయించుకోవాలి. అప్పుడు వాళ్ల శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ఛాన్స్ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. ఈ టెస్ట్​లు ప్రతి హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి.