Beauty Tips : గులాబీ నీళ్లు, నూనె ఒంటికి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటీ..!

చూడ్డానికి గులాబీ ఎంత అందంగా ఉంటుందో ముఖానికి అంతే అందానిస్తుంది. తాజా గులాబీపూలు ఏ వాతావరణాన్ని అయినా ఆహ్లాదంగా మార్చేస్తాయి. అంతేనా! అందానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారు చేసే గులాబీనీరు, నూనె వంటివి చర్మాన్ని రక్షిస్తాయి కూడా.

గులాబీ నీళ్లు

చర్మంపై ఉన్న మురికిని తొలగించి.. సహజంగా మెరిసిపోయేలా చేస్తుంది రోజ్ వాటర్. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చాక కాస్త గులాబీనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. టోనర్గా, క్లెన్సర్గా ఉపయోగపడుతుంది. మేకప్ వేసుకున్న తర్వాత పేరుకుపోయిప మురికిని కూడా రోజ్ వాటర్ తొలగిస్తుంది.
అంతేకాదు కళ్ల చుట్టూ ఉండే నల్లటి చారలను, మచ్చలను కూడా రోజ్ వాటర్ తగ్గిస్తుంది. గులాబీ నూనె
గులాబీ నూనె చర్మానికి తేమనిచ్చి మృదువుగా మారుస్తుంది. అంతేకాదు చర్మానికి నిగారింపు నిస్తుంది.

సన్ స్క్రీన్

గులాబీ రేకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఆ పోషకం సూర్యకిరణాలు చర్మాన్ని ప్రభావితం చేయకుండా అడ్డుకుంటుంది. కీరదోస రసం, గ్లిజరిన్, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి రాసుకుంటే ఎండ ప్రభావం చర్మంపై పడదు.