హెచ్చరికలు లేకుండా మూసీ గేట్లు ఓపెన్.. వరదలో కొట్టుకుపోయిన 20 గేదెలు

నల్లగొండ: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పొటెత్తడంతో అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే  ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లు తెరవడంతో కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని మూసీ వాగులోకి ఒక్కసారిగా వరద పొటెత్తింది. దీంతో వాగు పరివాహక ప్రాంతంలో పశువులను మేపుతోన్న పశువుల కాపరులు వాగు మధ్యలో చిక్కుపోయారు. వరద ఉధృతికి ఇరవై గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయాయి. నది మధ్యలో చిక్కుపోయి అర్తనాథాలు పెడుతోన్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ALSO READ | రైతును చెరువులోకి లాక్కెళ్లిన గేదె .. నీటిలో మునిగి రైతు మృతి

వెంటనే రియాక్ట్ అయిన నల్లగొండ డీఎస్పీ శివరామ్ రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన సిబ్బందిని పంపించారు. వరద ప్రవాహంలో చిక్కుపోయిన పశువుల కాపరులను జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు మూసీ గేట్లు ఓపెన్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలో గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది