మామిడాలపల్లి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమెరికాలో సీటు

వీణవంక, వెలుగు: అమెరికాలో ఉన్నత విద్యచదివేందుకు వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన మూల పావని ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికైంది. ఆదివారం కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వొడితల ప్రణవ్ ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో చదివేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పావని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి, కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాపూజీ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసింది.