Hyderabad History : అస్మాన్ గఢ్ కొండపై ఉన్న స్థూపం ఏంటీ.. ప్రేమకు చిహ్నం అని ఎంత మందికి తెలుసు..!

గొప్ప స్థలాలు, చిహ్నాలు మన పక్కనే ఉంటాయి. రోజు చూస్తున్నా.. అటు నుంచే వెళ్తున్నా పనుల్లో పడి ఆలోచించం. కానీ ఎవరన్నా చెప్తే అలాగా.. అని ఆశ్చర్యపోతాం. మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం.. మలక్ పేటలో అలాంటి ఒక చారిత్రక చిహ్నం ఉంది.

హైదరాబాద్ లోని మలక్ పేట వ్యాపారానికి పెట్టింది పేరు. కిరాణా వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్షాషా సేవకుడైన మాలిక్ యాకూబ్ పేరు మీద ఈ ప్రాంతానికి మలకపేట' అనే పేరు వచ్చింది. పేట పరిధిలోని ఆస్కానర్లో ఎత్తైన కొండమీద ఒక పెద్ద స్థూపం ఉంది. అది ఒక ఫ్రెంచ్ వ్యక్తికి సంబందించిన సమాధి.

మనసున్న అధికారి

ఇరవై ఏళ్లప్పుడు తమ్ముడు జీప్ మండ్స్ కలిసి వ్యాపారం చేద్దామని ఫ్రాన్స్ నుంచి పాండిచ్చేరి వచ్చాడు రేమండ్స్ అనుకోని పరిస్థితుల్లో భారతదేశ సైనికుడయ్యాడు. ఫ్రెంచి వ్యక్తి కావడంతో కొంతకాలం అప్పటి ఫ్రెంచి జనరల్ బుస్సీ దగ్గర పనిచేసి తర్వాత హైదరాబాద్ నిజాం దగ్గర చేరాడు. రెండో నిజాం అలీఖాన్ క్కు సమ్మకస్తుడైన సైన్యాధికారిగా పనిచేశాడు. మూడు వందలమంది సైనికులకు అధికారి అయ్యాడు. తర్వాత ఫిరంగి సైన్యాన్ని బాగా పటిష్టం చేశాడు. పిరంగులు, వాటి గుండ్లను తయారు చేసే కర్మాగారాన్ని స్థాపించాడు. తుపాకులు, పిరంగులు, గుండ్లు అన్నింటికీ పర్యవేక్షణ వహించేవాడు. చనిపోయే నాటికి 14వేలమంది సైనికులకు రేమండ్స్ అధికారి అయితే రేమండ్స్ నవాబు అలీఖాన్నే కాకుండా మంచి పనులు చేసి ప్రజలకు చేరువయ్యాడు హిందు. ముస్లిం, క్రైస్తవ అనే భేదాలు లేకుండా ప్రజలు. అతడిని 'ముసారహీం' అని అభిమానంగా పిలిచేవాళ్లు అతడి పేరు మీదే ముసారాంబాగ్' ఏర్పాటైందని స్థానికులు అంటారు.

 స్థూపం

రేమండ్స్ చనిపోయినప్పుడు అతడి జ్ఞాపకార్థంగా 1798లో మలక్ పేట అస్కానర్లోని ఎత్తైన కొండపై ఓ స్థూపాన్ని కట్టారు. ఈ స్థూపం పొడవు 200 అడుగులు, వెడల్పు 98 అడుగులు, ఎత్తు 26 అడుగులు, దీనిని యూరోపియన్ శైలిలో, 28 పిల్లర్లతో నిర్శించారు. అతడి కుటుంబ సభ్యులకు ఇష్టమని ఈ సమాధి పక్కనే కుక్క, గుర్రం సమాధులను కూడా కట్టారు. అతడు కేవలం సైన్యాధికారి మాత్రమే కాదు ప్రజల ప్రేమ. దయ సహకారం పొందిన అధికారి అని చెప్పడానికి ఈ స్థూపాన్ని గుర్తుగా నిర్మించారు. ఈ స్థూపాన్ని చూసేందుకు అప్పుడప్పుడు ఫ్రాన్స్ మంచి పర్యాటకులు వచ్చేవాళ్లు. అంతేకాదు ఒకప్పుడు రేమండ్స్ స్మారక జాతర కూడా నిర్వహించేవాళ్లని స్థానికులు అంటుంటారు.