ఎంత సంపాదిస్తున్నా.. కొంతమంది ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా వారి ఆర్ధిక పరిస్థితి ఉంటుంది. నెల మొదట్లో జీతం తీసుకుంటే 20వ తేదీ నాటికి కొంతమంది అప్పులు ఎక్కడ దొరుకుతాయా అని ఎదురుచూస్తుంటారు, ఆర్ధికంగా స్థిరపడాలన్న ఆ దిశగా విజయం సాధించలేకపోతారు. అంటే వారి ప్లాన్ లో ఏవో కొన్ని లోపాలు..ఉన్నాయన్నమాట. అలాంటి వారు కొన్ని అలవాట్లను వదిలేస్తే ఆర్ధికంగా ఎదుగుతారు. మరి వారు ఎలాంటి అలవాట్లను మానుకోవాలో తెలుసుకుందాం. . . .
డబ్బు ఎవరికి చేదు..? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడూ కష్టపడేది డబ్బు కోసమే. ఆ డబ్బు సంపాదనకోసమే పరుగులు తీస్తూ ఉంటాడు. రూపాయి ఉన్నవారు పది రూపాయలు సంపాదించాలని ... పది రూపాయలు ఉన్నవారు సంపాదన రూ.100కి పెంచుకోవాలని తాపత్రయపడుతుంటారు. అందులో తప్పులేదు. అయితే.. కొందరు ఉంటారు.. తమ సంపాదన పెరుగుతున్నా కూడా.. తాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నామని అంటాడు. సంపాదనతోపాటు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని.. కనీసం ఒక ఇంటికి కూడా కట్టుకోలేకపోయాం.. అప్పులు కూడా తీరలేదు అని చెబుతూ ఉంటారు. అయితే.. ఆర్థిక ఎదుగుదల ఉండటం లేదు అంటే.. అది మన తప్పే అవుతుంది. ముఖ్యంగా మనకు ఉన్న కొన్ని అలవాట్ల కారణంగానే.. మనం ఎంత సంపాదించినా పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటాం.
1.బడ్జెట్ లేకపోవడం: మనకు వచ్చే సంపాదన ఏంతైనా సరే.. వచ్చేది ఏంత..? మనం పెడుతున్న ఖర్చు ఎంత..? దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాం..? ఎక్కడ పొదుపు చేయాలి అనే బడ్జెట్ ని తయారు చేసుకోవాలి. ఈ అలవాటు లేకపోతే.. ఎంత వచ్చినా.. వచ్చింది వచ్చేనట్లే ఎక్కడ పోతుందో కూడా తెలీదు.
2. అధిక రుణాలు : ఈ రోజుల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ బ్యాంకులు చాలా సులభంగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తోంది. దీంతో.. అవసరానికి మించి దానిని వాడటం మొదలుపెడుతున్నారు. క్రెడిట్ కార్డ్‌లు, రుణాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల అధిక వడ్డీ చెల్లింపులు, ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుంది. దీనివల్ల పెట్టుబడి పెట్టడం, సంపద పెరగడం కూడా అసాధ్యం.
3.సరిపోని పొదుపు: ప్రజలు అత్యవసర నిధులు లేదా పొదుపు లేకుండా ఆర్థిక సంక్షోభాలకు గురవుతారు. ఇది ఎప్పటికీ అంతం లేని ఆర్థిక డూమ్ లూప్‌ను సృష్టిస్తుంది.
4.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం: పదవీ విరమణ వంటి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడంలో విఫలమైతే, దీర్ఘకాలికంగా ఆర్థిక అభద్రత ఏర్పడవచ్చు.
5.ఇంపల్స్ కొనుగోలు: దీర్ఘకాలిక చిక్కులను పరిగణనలోకి తీసుకోకుండా అనవసరమైన వస్తువులను ఖర్చు చేయడం ఆర్థిక వనరులను క్షీణింపజేస్తుంది.
6.విద్య/నైపుణ్యాలపై తక్కువ పెట్టుబడి: తమపై పెట్టుబడి పెట్టకపోవడం వల్ల సంపాదన సంభావ్యత , కెరీర్ పురోగతిని పరిమితం చేయవచ్చు.
7.బీమాను నిర్లక్ష్యం చేయడం: తగినంత బీమా లేకపోవడం ఊహించని సంఘటనలలో గణనీయమైన ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. భీమా లేకపోవడం ఒక విపత్తు తర్వాత మీరు విచ్ఛిన్నం కావడానికి కారణం కావచ్చు.
8.స్వల్పకాలిక ఆలోచన: దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యంపై తక్షణ తృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రజలు సంపద పోగుచేసే ప్రణాళికను కలిగి ఉండకుండా నిరోధించవచ్చు. ఈ అలవాట్లు వ్యక్తి ఆర్థిక ఆరోగ్యం , కాలక్రమేణా సంపదను కూడబెట్టుకునే సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి