Vijay Hazare Trophy: షమీ ఇంకా కోలుకోలేదా..? విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌కు రెస్ట్

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. దేశవాళీ వన్డే ఫార్మాట్ లో జరిగే విజయ్ హజారే ట్రోఫీకి తొలి మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. విజయ్ హజారే ట్రోఫీ శనివారం (డిసెంబర్ 21) ప్రారంభం కానుంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించిన 20 మంది సభ్యుల జట్టులో షమీకి చోటు దక్కింది. అయితే ఇప్పుడు షమీ హైదరాబాద్‌లో జరిగే ఓపెనింగ్ క్లాష్‌కు దూరంగా ఉండనున్నాడు.

రంజీ ట్రోఫీ ద్వారా క్రికెట్ లోకి కంబ్యాక్ ఇచ్చిన షమీ.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడి కోలుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వచ్చినా అతన్ని సెలక్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడని.. అతను 100 శాతం ఫిట్ గా లేడని పెర్త్ టెస్ట్ ముగిసిన తర్వాత తెలిపాడు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అతను అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ జట్టు ఆశిస్తోంది. 

వరల్డ్ కప్ లో గాయపడిన షమీ ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు షమీ దూరమయ్యాడు. వీటితో పాటు ఇండియాలో మెగా ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. షమీ చివరిసారిగా భారత్ వేదికగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆడాడు.

? ???? ?????? ?

Mohammed Shami has been rested for the opening game of the Vijay Hazare Trophy in Hyderabad ?

The Bengal Cricket Board has decided to give him a break for tomorrow's match against Delhi ?#MohammedShami #Bengal #VHT #Sportskeeda pic.twitter.com/qrxaJYDtWI

— Sportskeeda (@Sportskeeda) December 20, 2024