మోడ్రన్​ డంపింగ్​యార్డు ప్రారంభం

ఎడపల్లి , వెలుగు: ఎడపల్లి మండల కేంద్రంలో  ఏర్పాటుచేసిన మోడ్రన్ డంపింగ్​యార్డును  జిల్లా అదనపు కలెక్టర్​ అంకిత్​ ప్రారంభించారు. యార్డులో రూ.5 లక్షల వ్యయంతో క్రషింగ్​మిషన్ ఏర్పాటు చేశారు.  ప్లాస్టిక్​ వస్తువులను ఈ మిషన్​ద్వారా  క్రషింగ్​చేసి మార్కెటింగ్​చేయొచ్చని అధికారులు తెలిపారు. 

 ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్​ మాట్లాడుతూ.. క్రషింగ్​యంత్రాన్ని స్థానిక మహిళా సంఘాలు ఉపయోగించు కొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ సాయాగౌడ్,  ఎంపీడీఓ శంకర్, మాజీ జడ్పీటీసీ రజితాయాదవ్, ఐకేపీ ఏపీఎం సాయిలు, మార్కెట్​కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, సింగిల్​విండో చైర్మన్​మల్కారెడ్డి, కాంగ్రెస్​ పార్టీ నాయకులు పాల్గొన్నారు.