Good Health : మందు మానేయటం కంటే.. మితంగా తాగితేనే బెటర్.. రోజుకు ఒక్క పెగ్గు బెటర్..

మందు బాబులకు గుడ్ న్యూస్. ఆరోగ్యంగా ఉండాలంటే మందు మానేయమనే సలహాలు వినీ వినీ విసిగిపోయారు కదా. కానీ ఈ న్యూస్ వింటే ఇక ఆ అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే రీసెంట్ స్టడీస్ లో మందు తాగడం మంచిదే అని తేల్చారు సైంటిస్టులు. మందు మానేయాల్సిన అవసరం లేదు.. కాకపోతే తాగడానికి కూడా ఓ లెక్కుంది.. అది ఫాలో అయితే చాలా బెటర్. అదేంటో చదవండి.

మందు పూర్తిగా మానేయటం కంటే కంట్రోల్ గా.. కొంచె కొంచెంగా తాగితే ఇంకొన్నాళ్లు ఎక్కువ బతకొచ్చు అని రీసర్చ్ లో తేలింది. రోజుకు ఒక పెగ్గు తీసుకుంటే అది మన హెల్త్ కు ఎంతో మేలు చేస్తుందట. దీని వల్ల మన ఆయుష్షు కొంత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మితంగా.. రోజుకు ఒక పెగ్గు లెక్కన తాగితే కొన్నాళ్లు ఎక్కువగా బతికే అవకాశం ఉందని తేల్చేశారు సైంటిస్టులు. 

అమెరికాలో ఆహార మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే గతంలో ఉన్న నిబంధనలు మందును పూర్తిగా మానెయ్యాలని ఉండేవి. కానీ తాజాగా రూపొందిస్తున్న నిబంధనలు తాగడం తాగక పోవడం పౌరుల వ్యక్తిగతం.. అయితే మితంగా తాగడం ఆరోగ్యకరం అనే ఉద్దేశంతో రూపొందిస్తున్నారు. 2025లో ఈ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

పరిశోధనలో ఏం కనుగొన్నారు?

పురుషులకు రోజుకు రెండు పెగ్గులు, మహిళలకు రోజుకు ఒక పెగ్గు చొప్పున తీసుకోవడం శ్రేయస్కరం అని పరిశోధనలో తేలింది. మితంగా తాగడం వలన హర్ట స్ట్రోక్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుందట. అయితే బ్రెస్ట్ క్యా్న్సర్ ఉన్న వాళ్లకు సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుందని తేలింది. ఇతర క్యాన్సర్స్ ఉన్న వాళ్లకి ప్రాబ్లం లేదని పరిశోధనలో వెల్లడైంది.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ‘మద్యం సేవించక పోవడం ఆరోగ్య కరం’ అనే మార్గదర్శకాలకు ఈ ఫలితాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. అయితే క్యాన్సర్ ను దృష్టిలో ఉంచుకొని మద్యం పూర్తిగా తాగొద్దని ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇచ్చిందని చెబుతున్నారు. 

ఇక జాతీయ అకాడమీ పరిశోధనలో మద్యం ఎక్కువగా తాగడం యువతకు ఎంత మాత్రం మంచిది కాదని చెబుతున్నాయి. 
అయితే తాజా పరిశోధనల ప్రకారం మనం గుర్తించుకోవాల్సిన, పాటించాల్సిన అంశం ఏంటంటే.. హెవీ డ్రింకింగ్ మంచిది కాదు. అంటే రోజుకు మూడు, నాలుగు సార్లు తాగడం అస్సలు మంచిది కాదు. రోజుకు ఒక్క పెగ్గు బెటర్.. మరీ తప్పదనిపిస్తే రెండు పెగ్గులతో సరిపెట్టుకోవడం చాలా బెటర్. ఈ రీసర్చ్ ఏదో బాగుంది కదా. తాగుడు మానేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా తాగడం వలన హెల్త్ కు మంచే జరుగుతుంది అని. తాగడం అంటే ఒకే పెగ్గు.. గుర్తు పెట్టుకుంటారు కదూ. ఫాలో అయితే ఇంకా బెటర్.