లోక్​సభ ఎలక్షన్​లో బీఆర్ఎస్​ ఒక్క సీటు గెలవదు : మహేశ్​గౌడ్

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినాకేటీఆర్​కు అహంకారం తగ్గలేదు
  • రాష్ట్రంలో గులాబీ పార్టీ భూస్థాపితం
  • ఎమ్మెల్సీ మహేశ్​గౌడ్

నిజామాబాద్​, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నా బీఆర్ఎస్​ లీడర్ల అహం తగ్గలేదని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్​గౌడ్​పేర్కొన్నారు. లోక్​సభ ఎలక్షన్​లో గులాబీ పార్టీకి ఒక్కసీటు గెలిచే పరిస్థితి లేదని, రాష్ట్రంలో ఇక ఆ పార్టీ భూస్థాపితమేనన్నారు. సోమవారం ఆయన డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్​ను గద్దె దింపుతామంటూ బీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​చేస్తున్న కామెంట్లు ఆయన గర్వానికి నిదర్శనమన్నారు. 

తండ్రి (కేసీఆర్) చాటు బిడ్డగా సీఎం కుర్చీపై కన్నేసిన కేటీఆర్, అది సాధ్యం కాకపోవడంతో మతి భ్రమించిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఫైర్​ అయ్యారు. పాలనా వ్యవస్థ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్​గవర్నమెంట్​కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పేరుతో పెద్ద కుంభకోణం చేశారని, కృష్ణా జలాలను ఆంధ్రా ప్రాంతానికి ధారాదత్తం చేశారన్నారు. 

ALSO READ : జడ్చర్ల లో ఎయిర్​పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లు : మన్నే శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏ రోజు జాతీయ హోదా ఆడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్​రెడ్డి సీఎం అవుతారని గ్రహించిన ప్రజలు, కాంగ్రెస్​కు అధికారం కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్​సంప్రదాయానికి భిన్నంగా రేవంత్​పేరును ఎన్నికల ముందే ప్రకటించి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు కూడా గెలిచేవారుకాదన్నారు.  ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్​పార్టీ కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రత్నాకర్​, కేశవేణు తదితరులు పాల్గొన్నారు.