ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా

ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం

కరీంనగర్, వెలుగు : ఎమ్మెల్సీ పదవి మరింత బాధ్యత పెంచిందని, ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వివిధ ప్రజా సంఘాలు, ప్రైవేట్‌‌‌‌ కాలేజీలు, జేఏసీల ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌‌‌‌లో ఆయనకు పౌరసన్మానం చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పైసలు కేంద్రంగా నడిచే రాజకీయాలు మారాలని, ప్రజలే కేంద్రంగా రాజకీయాలు నడవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఓటమితో నిరంకుశత్వం పోయిందని, వేధింపులు లేవని, ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ అవసరం లేకుండా పోయిందన్నారు. టీజేఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అల్ఫోర్స్ నరేందర్‌‌‌‌రెడ్డి, రవీందర్‌‌‌‌రెడ్డి, నరహరి జగ్గారెడ్డి, గోపాల్ రెడ్డి, టీజేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్‌‌‌‌ జక్కోజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.